బడ్జెట్ నిధులపై టీఆర్ఎస్- బీజేపీ రచ్చ... ఇది వ్యూహంలో భాగమేనా?

తెలంగాణలో రాజకీయ వాతావరణం రణరంగంగా మారుతోంది.టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.

ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్న బీజేపీ ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రోజూ వార్తల్లో నిలుస్తున్నారు.అయితే బడ్జెట్ నిధులతో తెలంగాణ ప్రభుత్వం ఎంజాయ్ చేస్తోందని, ప్రజలకు తెలియనివ్వకుండా కేంద్రానికి ఎక్కడ మంచి పేరు వస్తోందేమోనని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన పత్రాలను జతచేస్తూ, ట్విట్టర్ లో అసలు బడ్జెట్ వివరాలను వెల్లడించారు.

అయితే ఈ విమర్శకు, ప్రతి విమర్శ చేయడం ఇది ఇరుపార్టీల వ్యూహంలా అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఇద్దరి మధ్యే పోటీ ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఖాతరు చేయకుండా చేయాలన్నది ఇరు పార్టీల వ్యూహంలా కనిపిస్తోంది.

Advertisement

ఇంకా భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది.ఇప్పటికే సవాళ్లు, ప్రతి సవాళ్ళ మధ్య సాగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా ప్రచారం ప్రారంభించి టీ ఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ చూస్తోంది.

అందులో భాగంగానే మరల మాటల దాడిని ప్రారంభించారని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు