కల్కి అంతా ఫేక్ అంటూ ట్రోల్స్.. విమర్శకులకు ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

గతేడాది థియేటర్లలో విడుదలైన కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది.

కల్కి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుండగా ఈ సీక్వెల్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.2028లో ఈ సీక్వెల్ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.అయితే కల్కి సినిమాలో ప్రభాస్( Prabhas ) చేసిన ఫైట్ సీన్స్ అన్నీ బాడీ డబుల్ ఫైట్ సీన్స్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.అయితే స్టార్ హీరోలు తమకెరీర్ లో రిస్కీ సన్నివేశాల్లో బాడీ డబుల్ లను ఉపయోగించడం జరుగుతోంది.వాస్తవానికి ఈ సినిమాలో అమితాబ్ కు( Amitabh Bachchan ) కూడా డూప్ గా ఒక వ్యక్తి నటించారు.

డూప్స్, బాడీ డబుల్స్ వాడినంత మాత్రాన స్టార్ హీరోల స్థాయి తగ్గదని కచ్చితంగా చెప్పవచ్చు.

Trolls On Prabhas Kalki Movie Details, Kalki Movie, Prabhas, Prabhas Kalki Movie

కల్కి సినిమా గురించి కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.కల్కి సినిమా థియేటర్లలో హిట్ గా నిలిచినా బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది.కల్కి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.

Trolls On Prabhas Kalki Movie Details, Kalki Movie, Prabhas, Prabhas Kalki Movie
Advertisement
Trolls On Prabhas Kalki Movie Details, Kalki Movie, Prabhas, Prabhas Kalki Movie

కల్కి సీక్వెల్ షుట్ మొదలుకావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది.1000 కోట్ల రూపాయలకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్ డేట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

ప్రభాస్ మాత్రం ఈ విమర్శలపై స్పందించే అవకాశం అయితే లేదు.

Advertisement

తాజా వార్తలు