అల్లు అర్జున్ చెప్పిన ఆ ఒక్క పాయింట్ వల్లే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందా..?

అల్లు అర్జున్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన మొదటి సినిమా జులాయి ఇక అప్పటి నుంచి వరుసగా సన్నాఫ్ సత్యమూర్తి అల వైకుంఠపురం లో సినిమాలు వచ్చి వీళ్ళ కాంబో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాయి.

ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది.

టబు, జయరాం, సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, సముద్రఖని, మురళి శర్మ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.గీత ఆర్ట్స్, హారిక , హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై అల్లు అరవింద్, సూర్య‌దేవ‌ర రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మించారు.

క్లీన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా 2020లో సంక్రాంతి పండుక కానుక‌గా విడుద‌లైంది.తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావ‌డంతో.

బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూల్ల‌ను ఓ రేంజ్ లో కుమ్మేసింది.అల్లు అర్జున్ నటన, డాన్స్ తో పాటు డైలాగ్ మాడ్యులేషన్ ఎంతోగానో ఆక‌ట్టుకున్నాయి.

Advertisement

త్రివిక్ర‌మ్ మేకింగ్ కు తోడు థ‌మ‌న్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవ‌ల్ అనే చెప్పాలి.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది.అయితే నిజానికి ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వాల్సింద‌ట‌.త్రివిక్ర‌మ్‌, అల్లు అర్జున్ కాంబోలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది.త్రివిక్ర‌మ్ క‌థ చెప్ప‌గానే క్ష‌ణం ఆలోచించ‌కుండా అల్లు అర్జున్ ఓకే చెప్పేశాడు.ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి కూడా పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్టలేదు.

అయితే ఫుల్ స్క్రిప్ట్ తో షూటింగ్ ప్రారంభం అయ్యాక‌.సెకండ హాఫ్ లో చాలా మార్పులు చేశార‌ట‌.ముందు రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ప్ర‌కారం క‌థ మొత్తం చాలా ఫ్లాట్ గా వెళ్లిపోతుంద‌ట‌.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన అల్లు అర్జున్‌.త్రివిక్ర‌మ్ కు చెప్పాడ‌ట‌.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

దాంతో షూటింగ్ కొంత పూర్తి అయ్యాక త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ స్క్రిప్ట్ పై క‌స‌ర‌త్తులు చేయ‌డం ప్రారంభించాడ‌ట‌.అలాగే సెకండ హాఫ్ కు సంబంధించిన స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేశార‌ట.

Advertisement

మ‌రికొన్ని కొత్త స‌న్నివేశాల‌ను కూడా రాసుకుని సినిమాను కంప్లీట్ చేశారా.అయితే ఈ కొత్త మార్పులు చేసుండ‌క‌పోయుంటే అల వైకుంఠ‌పురంలో ఖ‌చ్చితంగా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యేద‌ని అంటున్నారు.

అన్న‌ట్లు త్రివిక్ర‌మ్‌, అల్లు అర్జున్ కాంబోలో నాలుగో సినిమా సెట్ అయింది.ఈ ప్రాజెక్ట్ పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది.

ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు