హన్మకొండ జిల్లాలో విషాదం.. ముగ్గురు మృతి

హన్మకొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.శాయంపేట మండల కేంద్రంలోని ఓ ఇంటి గోడ కూలి ముగ్గురు మృత్యువాత పడ్డారు.

మృతులు ఒకే కుటుంబానికి సాంబయ్య, సారమ్మ, జోగమ్మగా సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే గోడ కూలిందని స్థానికులు భావిస్తున్నారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు