టీఆర్ఎస్, బీజేపీల‌పై టీపీసీసీ చీఫ్ ఫైర్

మునుగోడు ఉప ఎన్నిక చ‌ర్చ త‌ప్పుడు దారిలో పోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.స‌మ‌స్య‌ల‌పై కాకుండా వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌రుగ‌క‌పోతే ప్ర‌జ‌లు తీవ్రంగా నష్ట‌పోతార‌ని వ్యాఖ్య‌నించారు.టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, బీజేపీల‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకే కేసీఆర్ మునుగోడు వ‌స్తున్నార‌ని విమ‌ర్శించారు.కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు వివాదాల‌కు దూరంగా ఉండాల‌ని సూచించారు.అదేవిధంగా మునుగోడు అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం రూ.5 వేల కోట్లు ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు