రేపే నామినేషన్‎కి ఆఖరి రోజు.. ఖమ్మం ఎంపీ స్థానంపై సర్వత్రా ఉత్కంఠ

ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) నియోజకవర్గ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.ప్రస్తుతం పార్టీ అధిష్టానానికి ఖమ్మం అభ్యర్థి ఎంపిక వ్యవహారం తలనొప్పిగా మారింది.

ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి అంశం రోజుకో మలుపు తిరుగుతుంది.ఈ క్రమంలోనే ఖమ్మం రేసులో తెరపైకి రోజుకో పేరు వస్తుంది.

Tomorrow Is The Last Day For Nomination.. Everyone Is Excited About Khammam MP P

దీంతో జిల్లాకు చెందిన అమాత్యుల పంచాయతీ ఏఐసీసీకి చేరిందని తెలుస్తోంది.ఇప్పటికే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డి( Ramasahayam Raghuram reddy ) నామినేషన్ దాఖలు చేశారు.

అదేవిధంగా రాయల నాగేశ్వర రావు ( Rayala NageswaraRao )సైతం నామినేషన్ దాఖలు చేశారు.మరోవైపు పోట్ల నాగేశ్వర రావు కూడా నామినేషన్ వేశారు.

Advertisement

అయితే ఖమ్మం ఎంపీ స్థానాన్ని పాత కాంగ్రెస్ నేతలకే ఇవ్వాలని స్థానిక క్యాడర్ డిమాండ్ చేస్తోంది.ఇక రేపే నామినేషన్ వేసేందుకు ఆఖరి రోజు కావడంతో జిల్లా నేతల్లో, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?
Advertisement

తాజా వార్తలు