విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న టాలీవుడ్ సింగర్స్ వీరే !

సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి జీవితం ఎప్పుడూ పబ్లిక్ లో ఉన్నట్టుగానే ఉంటుంది.ఎందుకంటే వారి ప్రతి విషయం కూడా పబ్లిక్ లో నానుతూనే ఉంటుంది.

ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి సెలబ్రిటీ లైఫ్ లో ఏం జరుగుతుందో ఇట్టే అందరికీ తెలిసిపోతుంది.మరి టాలీవుడ్ లో చాలామంది సింగర్స్ ఉన్నారు.

అలా సింగర్ గా చెలామణి అవుతూ వైవాహిక జీవితంలో విఫలమై ఒంటరిగా జీవిస్తున్నారు.మరి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు.

ఆ సింగర్స్ ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సింగర్ కౌసల్య

కౌసల్య( Kausalya ) తన కొడుకు పుట్టిన వెంటనే భర్త నుంచి విడాకులు తీసుకొని విడిగా జీవించడం మొదలు పెట్టింది.

Advertisement

ఇప్పుడు ఆమె మరో వివాహం చేసుకోకుండా కొడుకు తోనే ఒంటరిగా జీవిస్తుంది.

సింగర్ కల్పన

సింగర్ కల్పన( Singer kalpana ) సైతం తన వ్యక్తిగత జీవితంలో విఫలమైంది అనేక బాధలు పడ్డ తర్వాత ఒక కూతురు ఉన్న కల్పన విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగానే తన జీవితాన్ని కొనసాగిస్తుంది.

సింగర్ మధుప్రియ

జానపద గీతాలతో వెలుగులోకి వచ్చి అలాగే అనేక పాటలతో తన కంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న సింగర్ మధుప్రియ( Singer Madhupriya ).ఆమె పెళ్లి ఇంట్లో చెప్పకుండా చేసుకొని సంచలనం సృష్టించింది.అలాగే విడాకులు కూడా ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా తీసుకొని ప్రస్తుతం తల్లిదండ్రులతో ఒంటరిగా జీవిస్తుంది.

సింగర్ నోయల్

సింగర్ నోయల్ ( Singer Noel )కి హీరోయిన్ ఎస్తర్ తో వివాహం జరగగా అతి తక్కువ రోజులకే వీరిద్దరూ విడాకులు బాట పట్టారు.ప్రస్తుతం నోయల్ మరో పెళ్లి చేసుకోలేదు అలాగే ఎస్తర్ కూడా ఇంకా సింగిల్ గానే ఉంది.మీరు మాత్రమే కాకుండా సింగర్స్ సునీత సైతం విడాకులు తీసుకున్నారు కానీ ఆమె మరో వివాహం చేసుకొని ప్రస్తుతం హ్యాపీగానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు అలాగే సింగర్ హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి ఒక ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారనే వార్తలు వస్తున్నాయి.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

ఇందులో నిజానిజాలు తెలియదు కానీ అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు