రొటీన్ కష్టాలతో కాలం చెల్లిన సినిమా . అష్టకష్టాలు అనుభవిస్తున్న హీరోలు, నిర్మాతలు

కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్ల నుంచి సినిమాల విడుదలకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి.

కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవడంతో ఇక అన్ని థియేటర్లు కూడా తెరుచుకోవడం తో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుసగా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పాలి.ఈ క్రమంలోనే హీరోలు నిర్మాతలు అందరిలో కూడా కొత్త టెన్షన్ పట్టుకుం.

ది ప్రేక్షకులు తమ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడి పోతున్నారు.కాగా ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా థియేటర్లలో త్రిబుల్ ఆర్ సినిమా హడావిడి చేస్తోంది.

సినిమా హడావిడి మరో రెండు వారాల్లో ముగియనుండగా అంతలోనే మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.తమిళ హీరో ఇలయ తలపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా విడుదల కాబోతుంది.

Advertisement

ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన కే జి ఎఫ్ 2 సినిమా కూడా ఏప్రిల్ 15వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే కేజిఎఫ్ మొదటి పార్ట్ తమిళ్ సినిమా గా వచ్చి భారత దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది.ఇప్పుడు కేజిఎఫ్2 కూడా విపరీతమైన అంచనాల మధ్య విడుదల కాబోతుంది.ఈ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.ఈ సినిమాలో చరణ్ కు కీలక పాత్రలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఇక ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న కొరటాల శివ ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

ఇక నాన్ స్టాప్ సక్సెస్ మీద ఉన్న మహేష్ బాబు మే 12వ తేదీన తన సర్కారు వారి పాట సినిమా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పరశురాం మేకింగ్ తో ప్రేక్షకులను ఆకర్షించడం ఖాయమని తెలుస్తోంది.ఇక సొంత టాలెంట్ తో ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో ప్రేక్షకులను ఆగస్టు 25 వ తేదీన పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.ఇక అన్ని సినిమాలు ఎలా రాణిస్తాయి అన్నది మాత్రం నిర్మాతలు అందరిలో కూడా టెన్షన్ పట్టుకుంది అని చెప్పాలి.

తాజా వార్తలు