పెళ్లి పీటలెక్కబోతున్న ప్రముఖ హీరోయిన్ అభినయ.. వరుడు ఎవరంటే?

టాలీవుడ్ హీరోయిన్ అభినయ( Heroine Abhinaya ) పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నోసార్లు అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఈ విషయంలో హీరో విశాల్( Vishal ) పేరు ఎక్కువగా వినిపించింది.

వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వినిపించాయి.కానీ ఆ వార్తలను అభినయ ఖండించిన విషయం తెలిసిందే.

అదే సమయంలోనే తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.ఆ ప్రేమ విషయం కాస్త ఇప్పుడు పెళ్లి( Marriage ) వరకు వచ్చినట్టు తెలుస్తోంది.

తన చిన్ననాటి స్నేహితుడితో అభినయ నిశ్చితార్థం( Abhinaya Engagement ) పూర్తయింది.వారిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నామనే విషయాన్ని అభినయ ప్రకటించింది.గుడిలో గంట కొడుతున్న ఫొటోను పోస్ట్ చేసింది.

Advertisement

అందులో తన కాబోయే భర్త చేతిని మాత్రమే చూపించింది.అంతకుమించి వివరాలు వెల్లడించలేదు ఈ బ్యూటీ.

అయితే విశాల్ తో డేటింగ్ వార్తల్ని ఖండించిన అభినయ తను ఆల్రెడీ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.

తన చిన్ననాటి స్నేహితుడితో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని ఆమె తెలిపింది.అయితే పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందని అప్పట్లో వెల్లడించిన ఈ నటి, ఇప్పుడు సడెన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయాన్ని బయటపెట్టింది.అయితే అభినయ తాజాగా అతని ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

కాబోయే భర్తని కూడా చూపించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి తన భర్తను ప్రేక్షకులకు ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి మరి.కాగా అభినయ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు