రవితేజ పరిచయం చేసిన 10 మంది టాలీవుడ్ దర్శకులు వీళ్ళే.. !

మన సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, అంచలంచలుగా తమ నటనతో అందరిని మెప్పిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని తెచ్చుకున్నారు.

అలాంటి కోవలోకి మన మెగాస్టార్ తరువాత వచ్చే హీరోలలో రవితేజ కూడా ఒకరు అని చెప్పాలి.

సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే ప్రతినాయకుడి పాత్రలలో నటించి చివరకు మాస్ మహారాజ్ స్టేజికి వచ్చేసాడు.ఇప్పుడున్న స్టార్ హీరోల్లో రవితేజ కూడా ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అయితే రవితేజ తాను నటించిన సినిమాల ద్వారా కొంతమంది దర్శకులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు.మరి రవితేజ పరిచయం చేసిన ఆ దర్శకులు ఎవరో.

ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Tollywood Directors Who Are Introduced By Hero Ravi Teja, Srinu Vaitla, Agastyan
Advertisement
Tollywood Directors Who Are Introduced By Hero Ravi Teja, Srinu Vaitla, Agastyan

శ్రీను వైట్ల: సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఆర్టిస్ట్ గా గుర్తింపు వస్తున్న సమయంలో నీకోసం అనే సినిమాలో హీరోగా నటించాడు.ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు.ఈ సినిమా మంచి హిట్ టాక్ తో పాటు రవితేజ జాతకాన్ని మార్చేసింది.

Tollywood Directors Who Are Introduced By Hero Ravi Teja, Srinu Vaitla, Agastyan

 అగస్త్యన్ : ఆ తరువాత రవితేజ ఈ అబ్బాయి చాలా మంచోడు అనే సినిమా ద్వారా అగస్త్యన్ అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.ఒక డిఫరెంట్ కధ కధనంతో సినిమా సాగుతుంది.ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు రవితేజను నిజంగా మంచి అబ్బాయి అని అనకుండా ఉండలేరు.

Tollywood Directors Who Are Introduced By Hero Ravi Teja, Srinu Vaitla, Agastyan

యోగి అలాగే రవితేజ, నమిత హీరో హీరోయిన్స్ గా ఒక రాజు ఒక రాణి సినిమాను తీశారు డైరెక్టర్ యోగి.ఇతను కూడా రవితేజ పరిచయం చేసిన డైరెక్టరే.

 ఏస్.గోపాల్ రెడ్డి : ఆ తరువాత సూపర్ హిట్ అయిన నా ఆటోగ్రాఫ్.స్వీట్ మెమోరీస్ అనే సినిమా ద్వారా ఏస్.గోపాల్ రెడ్డిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసాడు రవితేజ.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

బోయపాటి శ్రీను: రవితేజ కెరీర్ లో ఏ సినిమా ఒక బెస్ట్ అని చెప్పాలిసిందే.అలాగే రవితేజకి మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన సినిమా భద్ర.ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసాడు.

Advertisement

భద్ర సినిమా ఇప్పటికి ఆల్ టైం హిట్ లిస్ట్ లో ఒక మూవీగా నిలిచింది.

 హరీష్ శంకర్: అలాగే జ్యోతిక, రవితేజ కలిసి నటించిన షాక్ సినిమాను తెరకెక్కించింది డైరెక్టర్ హరీష్ శంకర్.

సముద్ర ఖని: అలాగే రవితేజ పరిచయం చేసిన దర్శకులలో సముద్ర ఖని కూడా ఒకరు.ఈయన శంభో శివ శంభో అనే సినిమాకి దర్శకుడిగా పని చేసారు.

 గోపీచంద్ మలినేని: అలాగే డైరెక్టర్ గోపీచంద్ మలినేనిని కూడా రవితేజ డాన్ శీను అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.

 కె.ఎస్.రవీంద్ర: అలాగే రవితేజ నటించిన పవర్ సినిమాను కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్ట్ చేసాడు.

 విక్రమ్ సిరికొండ: ఆ తరువాత టచ్ చేసి చూడు అనే మూవీ ద్వారా డైరెక్టర్ విక్రమ్ సిరికొండను కూడా మాస్ మహారాజ్ సినీ పరిశ్రమకి పరిచయం చేసాడు.ఆ యన పరిచయం చేసిన డైరెక్టర్స్ లో కొంతమంది ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు.మొత్తం మీద ఒక పది మంది డైరెక్టర్స్ ని మన తెలుగు చలన చిత్ర సీమకి పరిచయం చేసిన ఘనత మన మాస్ మహారాజ్ కే దక్కింది కదా.

తాజా వార్తలు