నేడు మునుగోడు నామినేషన్ల విత్ డ్రాకు తుది గడువు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగియనుంది.ఈ విత్ డ్రా ప్రక్రియకు మధ్యాహ్నం 3 గంటల వరకు తుది గడువు.

కాగా ఇప్పటివరకు ఉపఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు అయ్యాయి.తుది గడువు ముగిసిన తర్వాత తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.

Today Is The Last Date For Draw With Previous Nominations-నేడు మున

అయితే, టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిలు బరిలో ఉన్నారు.ఈ ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.

కాగా నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.నవంబర్ 6న ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు.

Advertisement
నాన్నలేని లోటును ఆమె తీర్చారు.... ఎమోషనల్ అయిన ఎన్టీఆర్! 

తాజా వార్తలు