ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవాలంటే 600 మీటర్ల నీటి లోతులో వెళ్లాలి.. ఈ ఆలయం ఎక్కడంటే!

భారతదేశం ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు నిలయం అని చెబుతారు.మన భారతదేశంలో కొలువై ఉన్న ఎన్నో ఆలయాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ విధంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆలయాలను సందర్శించడానికి చాలామంది తీర్థయాత్రలు వెళ్తుంటారు.ఈ విధంగా తీర్థయాత్రలు వెళ్లేవారు తప్పకుండా ఝర్ణీ నరసింహ క్షేత్రాన్ని దర్శించుకుంటారు.

To Visit The Swami In This Field One Has To Go To A Depth Of 600 Meters Where Is

క్రీ.పూ 400 ల ఏళ్ల క్రితం ఈ ఆలయంలో స్వామివారు కొలువై ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంలో దర్శనానికి వెళ్ళే భక్తులు మన దేశంలో ఏ ఆలయంలో కూడా ఉండని విధంగా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.అయితే ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement

బీదర్ కు దగ్గరలో ఉన్న మంగళ్ పేట్ అనే ప్రాంతంలో ఈ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు.ఈ క్షేత్రంలో కొలువై ఉన్న స్వామివారిని జల నరసింహుడు అనే పేరుతో పిలుస్తారు.

ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే ఒకే గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో 600 మీటర్ల దూరం ప్రయాణం చేసి స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

పురాణాల ప్రకారం పరమశివుడే ఈ కొండ గుహలో తపస్సు చేస్తుండగా జల సుర అనే రాక్షసుడు శివుని తపస్సును భంగం కలిగించడానికి వివిధ రకాల ప్రయత్నాలను చేసేవాడు.అదే సమయంలో నరసింహ స్వామి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి హిరణ్యకశిపుని చంపి అరణ్యప్రాంతంలో తిరుగుతుంటాడు.

జలాసురుడు శివుడి తపస్సు భంగం చేయడం చూసిన నరసింహుడు ఎంతో ఆగ్రహం చెంది తన శిరస్సు ఖండిస్తాడు.అయితే తాను చేసిన కొన్ని మంచి పనుల వల్ల తనకు ఏదైనా వరం కావాలో కోరుకొమ్మని వారు అడగగా అందుకు జలాసురుడు నువ్వు ఇక్కడే కొలువై ఉండాలి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

అదేవిధంగా నా పేరుతో కలిపి నిన్ను భక్తులు పూజించాలి అనే వరం కోరుతాడు.ఆ విధంగా ఆ ప్రాంతంలో వెలసిన నరసింహ స్వామి వారిని జల నరసింహ స్వామి అని, ఈ స్వామి వారి చుట్టూ నీరు నిండి ఉంటాయి.

Advertisement

స్వామివారిని దర్శించాలంటే భక్తులు ఆరు వందల మీటర్ల నీటి లోతులో వెళ్లాల్సి ఉంటుంది.

తాజా వార్తలు