శ్రీవారి వీఐపీ భక్తులకు బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎప్పుడంటే..

తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో అయితే శ్రీనివాసుడికి ప్రతి సమయం రకరకాల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.

వీటిలో ఒకటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఈ ఉత్సవాన్ని సంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో ఈనెల 27న ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు దేవాలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

దీనివల్ల డిసెంబర్ 27న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.అంతే కాకుండా ఈ ఉత్సవం కారణంగా డిసెంబర్ 26న సిఫారసులు లేఖలు స్వీకరించారని కూడా వెల్లడించింది.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.మహావిష్ణువు భూలోకంలో స్వయంగా వెలసిన క్షేత్రం తిరుమల అత్యంత పవిత్రమైంది.

Advertisement
Tirumala Vip Break Darshans Devotees Are Cancelled.. , Tirumala , Devotional

కాబట్టి ప్రతి సంవత్సరం ఉగాది వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు సార్లు శ్రీవారి దేవాలయాన్ని శుద్ధి చేస్తారు.ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా చేస్తారు.

దీనినే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని పిలుస్తూ ఉంటారు.కోయిల్ అంటే గుడి, ఆళ్వార్ అంటే భక్తుడు, ఆళ్వార్ అంటే శ్రీ వైష్ణవ పరంపరలో ఆళ్వార్లు శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన భక్తులు అని అర్థం.

తిరుమంజనం అంటే అభిషేకం అని అర్థం.జనవరి 2వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈనెల 27న దేవాలయ శుద్ధి చేయనున్నారు.

కర్పూరం, చందనం, కుంకుమ, పసుపు, కిచ్చలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి శ్రీవారి దేవాలయాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో శుద్ధి చేసే అవకాశం ఉంది.

Tirumala Vip Break Darshans Devotees Are Cancelled.. , Tirumala , Devotional
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

మరోవైపు తిరుమల లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఆరు కంపాన్మెంట్స్ లో ఎదురుచూస్తున్నారు.సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

మరో శుక్రవారం రోజున శ్రీవారిని దాదాపు 62,000 మంది శ్రీ వారిని దర్శించుకున్నట్లు సమాచారం.అంతేకాకుండా శ్రీవారికి కానుకల రూపంలో భక్తులు నాలుగు కోట్లు సమర్పించినట్లు సమాచారం.

తాజా వార్తలు