Tillu Square : ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన టిల్లు.. ఆ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయా?

సిద్దు జొన్నలగడ్డ,( Siddhu Jonnalagadda ) అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్.

( Tillu Square ) ఈ మూవీ తాజాగా 29న థియేటర్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.గతంలో విడుదలైన డిజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

డిజే టిల్లు( DJ Tillu ) తరహాలోనే టిల్లు స్క్వేర్ లో కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండడంతో ఆడియన్స్ కి కనెక్ట్ అయింది.ఈ సినిమాపై మొదటి నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కారణంగా యూత్ ఆడియన్స్ నుంచి ఫస్ట్ డే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా టిల్లు స్క్వేర్ సత్తా చాటడం విశేషం.మొదటి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూపడుతున్నారు.

Advertisement
Tillu Square First Day Collections-Tillu Square : ఫస్ట్ డే కల

మాస్ ఏరియాల్లో చాలా వరకు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.మల్టీప్లెక్స్ లలో కూడా 80 నుంచి 90 శాతం వరకు థియేటర్స్ ఫుల్ అయ్యాయి.ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు 23.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Tillu Square First Day Collections

ఒక మీడియం రేంజ్ హీరోకి ఈ స్థాయిలో కలెక్షన్( Tillu Square Collections ) రావడం అంటే మూవీపై ఏ రేంజ్ లో పాజిటివ్ బస్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.అలాగే సినిమాపై ఉన్న బజ్ కూడా ఓపెనింగ్స్ కు బాగా హెల్ప్ అయ్యింది.మేకర్స్ ప్రమోషన్స్ చేసిన విధానం పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది.ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఏకంగా 1.2 మిలియన్ డాలర్స్ ని టిల్లు స్క్వేర్ కలెక్ట్ చేసింది.ప్రీమియర్స్ కు కూడా స్ట్రాంగ్ రెస్పాన్స్ వచ్చింది.

ఓ విధంగా ఇది చిన్న హీరోల సినిమాలలో రికార్డు అని చెప్పాలి.మూవీలో టిల్లు గాడు చేసిన హంగామా, లిల్లీ తో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ప్రేక్షకులకు కావలసినంత వినోదం అందించింది.

అలాగే అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) బోర్డ్ పర్ఫామెన్స్ యూత్ కి విశేషంగా కనెక్ట్ అయింది.ఈ కారణంగానే మొదటి రోజు సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయని అర్థమవుతుంది.

Tillu Square First Day Collections
సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఎలాగూ వీకెండ్ తో పాటు సెలవులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి టిల్లు స్క్వేర్ 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం గ్యారంటీ అని నిర్మాత బలంగా నమ్ముతున్నారు.టాలీవుడ్ లో హనుమాన్ తర్వాత ఇప్పటివరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు. టిల్లు స్క్వేర్ మూవీతో ఆ లోటు తీరుతుందని సినీ పెద్దలు అంచనా వేస్తున్నారు.

Advertisement

అలాగే బయ్యర్లకు కూడా భారీగా లాభాలను ఈ సినిమా తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో రాధాకృష్ణ రిలీజ్ చేశారు.ఇక డైరెక్టర్ మల్లిక్ రామ్ కి కూడా ఈ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ పడిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా వార్తలు