టిక్ టాక్ దుర్గారావ్ ఈ స్థాయిలో ఉండడానికి జబర్దస్త్ లో అతనే కారణం?

నాది నక్కిలెసు గొలుసు అనే సాంగ్ వినగానే గుర్తొచ్చే మొదటి పేరు దుర్గా రావు.

టిక్ టాక్ ఆప్ లో తాను చేసిన డాన్స్ లకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.

ఆ పాటే తనని స్టార్ గా చేసిందని కూడా చెప్పవచ్చు.ఆయనొక్కడే కాదు ఆయన భార్య కూడా తనతో పాటు యాక్టింగ్ చేస్తూ చేసే సన్నివేశాలు చాలా ఫన్నీ వేలో చేయడంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇలా సాగుతున్న వీరి ప్రయాణం ఇప్పుడు టీవీ ఛానెల్స్ లో షోస్ చేసే స్థాయి వరకు చేరింది.సుడిగాలి సుధీర్, ఆది తమను ఎంతో ఎంకరేజ్ చేస్తారని దుర్గా రావు అన్నారు.

ఇప్పటికి చాలా ప్రోగ్రామ్స్ చేశామన్న ఆయన, దుర్గారావు చాలా కష్టపడి ఇంత వరకు వచ్చారు, ఆయనకు ఛాన్స్ ఇవ్వండి అని సుధీర్ తనకు మంచి స్థానం ఇస్తారని ఆయన తెలిపారు.ప్రస్తుతం మేము ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు సుడిగాలి సుధీర్ ఎంతో సహాయం చేశారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా టిక్ టాక్ దుర్గారావు తెలియజేశారు.

Advertisement

తాను కారవాన్ లోకి వెళ్ళగానే, సార్ అంటూ.పలకరిస్తారని ఆయన అన్నారు.

అంతే కాకుండా తమను తల్లిదండ్రులు భావించి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని ఆయన చెప్పారు.

ఇక తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక కంటెస్టంట్ గా ఉన్న యాంకర్ రవికి తమ సపోర్ట్ చేస్తామని వారు స్పష్టం చేశారు.ఎందుకంటే వారు ఏ షో వెళ్ళినా చాలా బాగా సపోర్ట్ చేస్తారని, ఒక ఇంట్లో మనిషిలా చూస్తారని వారు తెలిపారు.ఒకప్పుడు టిక్ టాక్ ఉండేది.

అది బ్యాన్ అయినప్పటి నుంచీ ఇన్స్టా లో రీల్స్ చేస్తున్నామని, ఏ కొత్త సాంగ్ వచ్చిన వెంటనే తాము రీల్స్ చేసి అభిమానులను అలరిస్తున్నామని ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేసిన దుర్గారావు బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో రవికే తన మద్దతు అని తన ఫాలోవర్స్ ని కూడా రవికి సపోర్ట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా టిక్ టాక్ దుర్గారావు తెలియజేశారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు