మొదటి రోజు కంటే 'టైగర్ నాగేశ్వరరావు'కు పండుగ రోజుల్లో భారీ రెస్పాన్స్!

మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja ) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఈయన ఒక బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దసరా బరిలో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు మాస్ రాజా వచ్చాడు.రవితేజ చేసిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.

నూతన డైరెక్టర్ వంశీ( Director Vamsee ) దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేసాడు.ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

దసరాకు భారీ పోటీ ఉన్నప్పటికీ మాస్ రాజా వెనకడుగు వేయకుండా వచ్చాడు.

Advertisement

ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కగా మొదటి రోజు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది.మరి ఈ సినిమా( Tiger Nageswara Rao ) ఇప్పుడు ఒక విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది.అది ఏంటి అంటే ఈ సినిమా రిలీజ్ రోజు కంటే 5,6 రోజుల్లో భారీ రెస్పాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.5, 6 రోజులు అంటే పండుగ రెండు రోజుల్లో ఈ సినిమాకు బుక్ మై షోలో రెస్పాన్స్ బాగా వచ్చిందట.అది కూడా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా ఈ రేంజ్ లో జంప్ చేయడం మాస్ రాజా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది.

మరి ఇదే జోరు కంటిన్యూ అయితే ఇది తప్పకుండ విజయం సాధించే అవకాశం ఉంది.

కాగా ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్( Nupur Sanon ), గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు.అలాగే జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా లాంగ్ రన్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement

తాజా వార్తలు