'టైగర్ నాగేశ్వరరావు' నుండి సెకండ్ సింగిల్ అప్డేట్.. ఎప్పుడంటే?

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ).

నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు ఉన్నాయి.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లింప్స్ తో అంచనాలు డబుల్ అయ్యాయి.

ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పీక్స్ కు చేర్చారు.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తూనే మరో పక్క ఒక్కో అప్డేట్ ఇస్తూ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.ఈ క్రమంలోనే ఇటీవలే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.

ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.ఈ రోజు సాయంత్రం 4.59 నిముషాలకు సెకండ్ సింగిల్ గురించి అప్డేట్ ఇస్తామంటూ తెలిపారు.

Advertisement

మరి మొదటి సాంగ్ డ్యూయెట్ సాంగ్ కాగా రెండవ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.కాగా నిజ జీవిత సంఘటనలతో 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇక అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.ఇక రవితేజ ఈ సినిమాతో పాటు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమా( EAGLE ) చేస్తున్నాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.అలాగే దీంతో పాటు గోపీచంద్ మలినేని సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు