పిడుగు రూపంలో కబళించిన మృత్యువు

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు ప్రజలని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నాయి.

ఈ అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా వేసవి పంటలు చాలా వరకు నష్టపోయాయి.

ఈ పంట నష్ట ఎ స్థాయిలొ ఉంటుందో అధికారులు అంచనా వేస్తున్నారు.అయితే ఈ అకాల వర్షంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది.

తాజాగా గుంటూరు జిల్లా పిడుగులతో కూడిన వర్షాలు జనవాసాన్ని భయపెట్టాయి.జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు.

వినుకొండ మండలం ఉప్పరపాలెంలో పిడుగు పడి గుమ్మా చిన్నయ్య, ఈపూరు మండలం అగ్నిగుండాల్లో వెంకటేశ్వర్ రెడ్డి, నూజెండ్ల మండలం దాసుపాలెంలో వెంకట కోటయ్య, కారంపూడి పంట పొలాల్లో పిడుగు పడి మిరప కోతకు వెళ్ళిన షేక్ మస్తాన్, నూజెండ్ల మండలం పమిడిపాడులో పిడుగు పడి కెనాల్ దగ్గర పనికి వెళ్లిన కూలీ మృతి చెందారు.ఈ మరణాలు ఇప్పుడు గుంటూరులో సంచలనంగా మారాయి.

Advertisement
నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

తాజా వార్తలు