కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ మరోసారి వాయిదా

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది.అయితే ఈ సమావేశానికి ఏపీ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఏపీ అసెంబ్లీ నేపథ్యంలో మీటింగ్ కు రాలేమని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి సమాచారం ఇచ్చారని సమాచారం.అసెంబ్లీ సమావేశాల తరువాత హాజరవుతామని వెల్లడించారు.

కృష్ణా జలాలను ఏపీ వినియోగిస్తుందని తెలంగాణ ఫిర్యాదు చేసింది.శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి వాటాకు మించి ఏపీ వాడుకుందని తెలంగాణ ఫిర్యాదులో పేర్కొంది.

అయితే తెలంగాణ ఫిర్యాదులో వాస్తవం లేదని ఏపీ చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు