బిగ్‌బాస్‌కు కొత్త హోస్ట్ రావడం ఏంటా అంటూ ఆశ్చర్య పోతున్నారా.
అసలు విషయం ఏంటీ అంటే తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3కి హస్టింగ్ చేస్తున్న నాగార్జున తీవ్రమైన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు.
ఇంకా ఆయన ఆరోగ్యం పట్ల పలు రకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో నాగార్జున స్వయంగా స్పందించి తాను కేవలం వైరల్ ఫీవర్‌తో మాత్రమే బాధపడుతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు.ఫీవర్ కారణంగా బర్త్‌డే వేడుకలు కూడా నిర్వహించలేదు.
నాగార్జున గత కొన్ని రోజులుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు.తీవ్రమైన డీహైడ్రేషన్‌తో పాటు పలు సమస్యలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఆయన కనీసం నిల్చుని మాట్లాడే పరిస్థితిలో లేడు.
మరి ఇప్పుడు ఈ శనిఆదివారాల కోసం ఎవరిని తీసుకు రావాలా అంటూ బిగ్‌బాస్ టీం ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది.నాగార్జున అనారోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని మరో హీరో లేదా హోస్ట్‌తో ఈ వారంను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మొదట నానితో ఈ వారం చేయాలనుకున్నా ఆయన ఇండియాలో లేడని తెలుస్తోంది.
అయితే వీకెండ్ ఎపిసోడ్స్ షూటింగ్ శనివారం ఉదయం నుండి రాత్రి వరకు సాగుతుంది.రెండు రోజులకు సంబంధించిన షూట్‌ను ఒక్క రోజులోనే పూర్తి చేస్తారు.అందుకే నాగార్జునను ఏదోలా తీసుకు వచ్చి మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా షూట్ చేయాలని కూడా నిర్వాహకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అవసరం అయితే స్టేజ్‌పై ఒక సోఫాను ఏర్పాటు చేసి అందులో కూర్చోబెట్టి కూడా నాగ్‌తో హోస్టింగ్ చేయించే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి శని ఆదివారాల ఎపిసోడ్‌లో ఏమవుతుందో చూడాలి.
ఇక ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్‌లో మహేష్, పునర్నవి, హిమజలు ఉన్నారు.వీరి ముగ్గురిలో మహేష్ వెళ్లి పోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy