Aloo chaat young lady : ఈ యువతి ప్రతి కూతురికి ఓ గొప్ప ఇన్‌స్పిరేషన్.. ఎందుకంటే..

స్ట్రీట్‌ఫుడ్‌ ఎన్నాళ్ళయినా ఆహార ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంటాయి.వీటిలో దొరికే రుచి మరే ఇతర ఆహారాలలో దొరకదు.

అందుకే వీటికింత డిమాండ్.అయితే ఇలాంటి ఫుడ్ తయారు చేయడంలో కొందరి తమ జీవితాలను పూర్తిగా అంకితం చేస్తున్నారు.

కాగా తాజాగా ఒక బాలిక పుట్టిన సమయం నుంచి తనకు 17 ఏళ్లుగా స్ట్రీట్ ఫుడ్ తయారు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.ఈమె తండ్రి ఒక స్ట్రీట్ ఫుడ్ మేకర్ కాగా అతనికి ఆమె సపోర్ట్‌గా ఉంటూ స్ట్రీట్ ఫుడ్ తయారు చేస్తూ స్థానికులకు బెస్ట్ టేస్ట్ అందిస్తోంది.

వివరాల్లోకి వెళితే.పంజాబ్‌లోని ఓ వీధిలో యువతి చాట్ అమ్ముతూ ఓ ఫుడ్ బ్లాగర్‌కి కనిపించింది.

Advertisement

ఆమె చకచకా పనులు చేస్తూ ఎంతో అనుభవం ఉన్న ఫుడ్ మేకర్ గా కనిపించడంతో ఆ బ్లాగర్‌ ఆశ్చర్యపోయాడు.తర్వాత ఆరా తీయగా ఆమె బాల్యం నుంచి 17 ఏండ్లుగా తన తండ్రికి సాయంగా స్ట్రీట్ ఫుడ్‌ను అమ్ముతున్నట్టు తెలిసింది.

చిన్నతనం నుంచి ఫ్రెండ్స్ తో ఆడుకోకుండా తన తండ్రికే సపోర్టుగా నిలిచిన ఈ అమ్మాయి గొప్పతనాన్ని ఆ బ్లాగర్‌ తాజాగా అందరితో పంచుకున్నాడు.ఈ అమ్మాయికి సంబంధించి అతడు సహీ హై అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.దీనికి ఇప్పటికే 90 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఫుడ్ సెంటర్ ముందు వరుసగా నిల్చున్న కస్టమర్లకు శరవేగంగా ఆ యువతి ఫుడ్ సర్వ్ చేస్తుండటం చూడవచ్చు.అలానే ఆమె ఆలూ టిక్కీ చాట్‌ను ప్రిపేర్ చేయడం గమనించవచ్చు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్, ఇలాంటి డెడికేషన్ ప్రతి కూతురికి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.అయితే ఇక్కడ రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్న వారు కామెంట్స్ చేస్తూ ఇక్కడ ఆలూ టిక్కీ చాట్‌ చాలా రుచిగా ఉంటుందని అంటున్నారు.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!

అలానే యువతిని చిన్నప్పటి నుంచి చూస్తున్నామని, ఆమె చాలా బాగా పనిచేస్తుందని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు