బట్టతల భయం వెంటాడుతుందా? అయితే తప్పకుండా ఇలా చేయండి!

బట్టతల.ఈ పేరు వింటేనే మగవారి మదిలో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది.

అందులోనూ పెళ్లి కాని అబ్బాయిలైతే ఇక అంతే సంగతులు.బట్టతల అందాన్ని దెబ్బ తీయడమే కాదు.

ఎన్నో అవమానాలను సైతం తెచ్చిపెడుతుంది.అందుకే బట్టతల రాకూడదని అబ్బాయిలందరూ కోరుకుంటారు.

కానీ నేటి కాలంలో చాలా మంది చిన్న వయసులోనే బట్టతలను ఫేస్ చేస్తున్నారు.ఒత్తిడి, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేయడం, ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి తదితర కారణాల వల్ల బట్టతల సమస్య ఏర్పడుతుంది.

Advertisement
This Super Remedy Helps To Prevent From Baldness, Baldness, Home Remedy, Latest

మీకు కూడా బట్టతల వస్తుందేమోనన్న భ‌యం వెంటాడుతుందా.? అయితే కచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అవ్వాల్సిందే.ఈ చిట్కా బట్టతలకు అడ్డుకట్ట వేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

అదే సమయంలో జుట్టును ఒత్తుగా పెరిగేందుకు ప్రోత్సహిస్తుంది.మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఆలస్యం చేయకుండా చూపు చూసేయండి.

ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి కొబ్బరి పాలను వేరు చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో కప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి.అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడి వేసి మీడియం ఫ్లేమ్ లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఆపై స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ కంప్లీట్ గా కూల్ అయిన అనంతరం రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడి, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

This Super Remedy Helps To Prevent From Baldness, Baldness, Home Remedy, Latest
Advertisement

ఈ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించి గంట లేదా రెండు గంటల పాటు షవర్ క్యాప్ ధరించాలి.అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు కనుక పురుషులు ఈ చిట్కాని పాటిస్తే బట్టతల అన్న మాటే అనరు.

పైగా జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.

తాజా వార్తలు