Mahesh Babu : ఆ సెంటిమెంట్ వల్ల మహేష్ మూడు సినిమాలు హిట్ కాలేదట.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు( Mahesh Babu ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.

మహేష్ సినిమా విడుదలైతే టాక్ తో సంబంధం లేకుండా సులువుగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే.

అయితే అమ్మ సెంటిమెంట్ వల్ల మహేష్ బాబు నటించిన మూడు సినిమాలు సక్సెస్ సాధించలేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.అమ్మ సెంటిమెంట్ మహేష్ కు అచ్చిరాలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మహేష్ కెరీర్ లో అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాలలో నిజం( nijam ) ఒకటి.ఈ సినిమాలో భర్త మరణించడంతో భార్య కొడుకుకు ట్రైనింగ్ ఇచ్చి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని భావిస్తారు.

నిజం సినిమా బాగానే ఉన్నా కొన్ని చిన్నచిన్న తప్పుల వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని పాటలకు ఆర్పీ పట్నాయక్ ( RP Patnaik )వాయిస్ కూడా మైనస్ అయింది.

Advertisement

తర్వాత రోజుల్లో మహేష్ బాబు మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన నాని( nani ) సినిమాలో నటించారు. ఎస్.జె.సూర్య ( S.J.Surya )డైరెక్షన్ లో అమీషా పటేల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.తాజాగా మహేష్ బాబు నటించి విడుదలైన గుంటూరు కారం సినిమా( Guntur Karam movie ) కూడా అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

సంక్రాంతికి రిలీజ్ కావడం వల్ల భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చినా ఈ సినిమా మహేష్ బాబు అభిమానులలో సైతం చాలామందికి నచ్చలేదు.అమ్మ సెంటిమెంట్ మహేష్ బాబుకు అచ్చిరాలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మహేష్ బాబు భవిష్యత్తులో ఈ తరహా కాన్సెప్ట్ లకు దూరంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు కథల ఎంపికలో మరింత వైవిధ్యం చూపించాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement

తాజా వార్తలు