చెంపలపై అసహ్యంగా కనిపించే మచ్చలను ప‌ది రోజుల్లో పైసా ఖర్చు లేకుండా వదిలించుకోండిలా!

సాధారణంగా కొందరికి ముఖం మొత్తం తెల్లగా మృదువుగానే ఉన్న చెంపలపై మాత్రం నల్లటి మచ్చలు అసహ్యంగా కనిపిస్తుంటాయి.

వీటి వల్ల అద్దంలో ముఖాన్ని చూసుకున్న ప్రతిసారి లోలోన తీవ్రంగా మదన పడుతుంటారు.

చెంపలపై ఏర్పడిన మచ్చలను వదిలించుకునేందుకు రకరకాల క్రీమ్స్, సీరమ్స్ వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్య‌మయ్యే చర్మం ఉత్పత్తుల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా పది రోజుల్లో చెంపలపై అసహ్యంగా కనిపించే మచ్చలను వదిలించుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే వంటింటి చిట్కా చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వంటింటి చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( Clove ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ లవంగాల పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.చివరిగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు తేనె వేసుకుని స్పూన్ సహాయంతో అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చెంపలపై కాస్త మందంగా అప్లై చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ ఇంటి చిట్కాను పాటిస్తే కేవలం పది రోజుల్లోనే మీరు అదిరిపోయే రిజల్ట్ ను గమనిస్తారు.

లవంగాలు, కాఫీ పౌడర్, పసుపు మరియు తేనె( Honey )లో ఉండే పలు సుగుణాలు చర్మంపై ఏర్పడిన ముదురు రంగు మచ్చలను క్రమక్రమంగా మాయం చేస్తాయి.స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేస్తాయి.

అలాగే చాలామంది పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతుంటారు.పిగ్మెంటేషన్‌ కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది.

కూరల్లోనే కాదు కరివేపాకును ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా?
క్యాల్షియం మన శరీరంలో ఎన్ని కీలకమైన పనులను చేస్తుందో తెలుసా?

అయితే స్కిన్ పిగ్మెంటేషన్ ను తగ్గించే సత్తా కూడా ఈ ఇంటి చిట్కాకు ఉంది.కాబట్టి మచ్చలేని చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు