నీరసం పట్టి పీడిస్తుందా.. ఏ పని చేయలేకపోతున్నారా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

నీరసం.( Dull ) చిన్న సమస్యగానే కనిపించినా దీని వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

నీరసం వల్ల ఏ పని చేయలేకపోతుంటారు.కొన్ని సార్లు అడుగు తీసి అడుగు వేయ‌డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

మిమ్మల్ని కూడా నీరసం పట్టి పీడిస్తుందా.? నీరసం నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా ఎఫెక్టివ్‌ గా సహాయపడుతుంది.నిత్యం ఈ జ్యూస్ ఒక గ్లాసు చొప్పున తాగితే నీరసం దెబ్బకు ఎగిరిపోతుంది.

ఫుల్ ఎనర్జిటిక్( Full energetic ) గా మారతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది తెలుసుకుందాం పదండి

Advertisement

ముందుగా ఒక యాపిల్ పండు( Apple fruit )ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, బొప్పాయి పండు ముక్కలు, అర అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ ఆపిల్ బొప్పాయి జ్యూస్( Papaya juice ) టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ పరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.నిత్యం ఒక గ్లాస్ ఈ ఆపిల్ బొప్పాయి జ్యూస్ తీసుకుంటే నీరసం, అలసట వంటివి పరార్ అవుతాయి.

చాలా ఎనర్జిటిక్ గా ఉత్సాహంగా మారతారు.అలాగే ఈ జ్యూస్ రక్తహీనతను తరిమికొడుతుంది.

డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల నుంచి త్వరగా కోలుకోవ‌డానికి హెల్ప్ చేస్తుంది.అంతేకాదు, ఈ యాపిల్ బొప్పాయి జ్యూస్ ను ప్ర‌తి రోజూ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

అధిక బ‌రువు నుంచి విముక్తి ల‌భిస్తుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

Advertisement

చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.మరియు క్యాన్సర్, మధుమేహం వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ సైతం త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు