ఈ పైలట్ గ్రేట్.. రక్తం కారుతున్నా విమానం నడుపుతూనే ఉన్నాడు

ఒక పైలట్‌ పనితీరుకు ఇప్పుడు అందరూ హ్యాట్సఫ్ చెబుతున్నారు.తనకు గాయమై రక్తం కారుతున్నా సరే విమానాన్ని నడుపుతూనే ఉన్నాడు.

పక్కకు దృష్టి పోకుండా విమానం నడపడంపైనే ఫోకస్ పెట్టాడు.తాను నొప్పిని భరిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్మస్థానానికి చేర్చాడు.

ఒక పక్షి పైలట్‌ను పొడుస్తూ ఉంది.ముఖంపై పొడుస్తుండటంతో రక్తం కారుతూ ఉంది.

అయితే పైలట్( pilot ) అలాగే విమానాన్ని నడిపాడు.ఈక్వెడార్‌లో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

ఈక్వెడార్‌లో( Ecuador ) గాల్లో ప్రయాణిస్తుండగా ఒక విమానాన్ని పక్షి ఢీకొట్టింది.ఈ సమయంలో కాక్‌పిట్‌లో పక్షి ( bird in the cockpit )ఇరుక్కుపోయి విమానం విండ్‌షీల్డ్‌ను దెబ్బతీసింది.పక్షి విమానం లోపలికి చేరుకుని పైలట్‌పై దాడి చేసింది.

పైలట్‌ ముఖంపై పొడిచింది.దీంతో పైలట్‌కు గాయాలై రక్తం ఏరులై పారింది.

రక్తం పారుతున్నా సరే పైలట్ తన విధులను మరువలేదు.అలాగే రక్తపు మడుగుల్లో ( pools of blood )విమానం నడుపుతూ విధిని నిర్వహించాడు.

భయపడకుండా అలాగే విమానాన్ని నడిపాడు.దీనికి సంబంధించిన విజువల్స్ విమానంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలు అన్ని ఉన్నాయా..

చనిపోయిన పక్షి తలపై వేలాడుతున్నా పైలట్ కొంచెం కూడా భయపలేదని ఈ వీడియోను బట్టి చూస్తే తెలుస్తోంది.ప్రశాంతంగా, ఎలాంటి భయం లేకుండా విమానం నడిపినట్లు వీడియో ద్వారా స్పష్టమవుతుంది.అయితే భూమి నుంచి 10 వేల అడుగుల ఎత్తులో మృతి చెందిన ఆ పక్షిని ఆండియన్ కాండోర్ పక్షిగా గుర్తించారు.

Advertisement

దక్షిణ అమెరికాలో కాథర్టిడ్ రాబందు జాతికి చెందిన పక్షిగా దీనిని గుర్తించారు.ప్రపంచంలోనే ఎక్కువ ఎత్తు ఎగిరే పక్షిగా దీనికి పేరుంది.దాదాపు 21 వేల 300 అడుగుల ఎత్తులో ఈ పక్షి ఎగరగలదని గుర్తించారు.

అయితే గాల్లో విమానం వెళ్లేటప్పుడు పక్షులు అడ్డుగా వస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే.

తాజా వార్తలు