ఈ హెయిర్ ప్యాక్ తో మీ జుట్టు రాలడం కాదు డబుల్ అవుతుంది..!

జుట్టు హెవీగా రాలిపోతుందా.? ఎంత కేర్ తీసుకున్నప్పటికీ జుట్టు ఊడడం ఆగడం లేదా.

? హెయిర్ ఫాల్ ( Hair fall )సమస్యతో విసిగిపోయారా.? అయితే ఇక టెన్షన్ అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ గురించి తెలుసుకుంటే సులభంగా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్ట‌వచ్చు.

ఈ ప్యాక్ జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.మరి ఇంతకీ ఆ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఉల్లి తొక్కలు ( Onion skins )వేసుకోవాలి.

అలాగే ఐదు లవంగాలు( cloves ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు( fenugreek ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న పదార్థాలను ఆరేడు నిమిషాల పాటు ఉడికించి వాటర్ ను ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి( Amla powder ), వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి( Neem powder ) వేసుకోవాలి.అలాగే ముందుగా తయారుచేసి పెట్టుకున్న వాటర్ కూడా పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే చాలా బెనిఫిట్స్ పొందుతారు.

ఈ ప్యాక్ జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది.జుట్టుకు చక్కని పోషణ అందిస్తుంది.

జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.

అదే సమయంలో ఈ ప్యాక్ తల‌లో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.కొత్త జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.ఊడిన జుట్టును మళ్ళీ మొలిపించి ఒత్తయిన కేశాలను మీ సొంతం చేస్తుంది.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!

పైగా ఈ ప్యాక్ ను వేసుకోవడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది.జుట్టు ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు