తరచూ డీహైడ్రేట్ అవుతున్నారా? అయితే ఇది కచ్చితంగా మీ డైట్ లో ఉండాల్సిందే!

డీహైడ్రేషన్.చాలామంది సర్వ సాధారణంగా ఎదుర్కొనే సమస్య ఇది.శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

అందులోనూ ప్రస్తుత వేసవి కాలంలో డీహైడ్రేషన్ సమస్య మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.

చాలా మంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తుంటారు.కానీ డీహైడ్రేషన్ వల్ల తీవ్రమైన తలనొప్పి, మానసిక గందరగోళం, అలసట, ఆకలి మందగించడం, విపరీతమైన దాహం, మూర్ఛ తదితర లక్షణాలు తలెత్తుతాయి.

అందుకే డీహైడ్రేషన్ కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.మీరు కూడా తరచూ డీహైడ్రేట్ అవుతున్నారా.? అయితే అసలు చింతించకండి.వెంటనే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.

ఈ జ్యూస్ డీహైడ్రేషన్ సమస్య నుండి మిమ్మల్ని రక్షించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.మీ బాడీని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి వాటర్ పోసి ఇర‌వై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు( Watermelon ), ఒక కప్పు కర్బూజ పండు ముక్కలు, ఆరు నుంచి ఎనిమిది నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పు, మూడు వాల్ నట్స్, రెండు టేబుల్ స్పూన్ల తేనె( Honey ), ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్‌ చేసుకున్న జ్యూస్ లో నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని సేవించడమే.

ఈ మెలన్ జ్యూస్ రోజుకు ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజు తీసుకుంటే డీహైడ్రేషన్ అన్నమాటే అనరు.మీ బాడీ ఎల్లప్పుడు హైడ్రేటెడ్ గా ఉంటుంది.అలాగే ఈ మెలన్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉంటుంది.అధిక రక్తపోటు సమస్య( Blood pressure) ) నుంచి విముక్తి లభిస్తుంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మరియు చర్మం కాంతివంతంగా సైతం మెరుస్తుంది.కాబట్టి డిహైడ్రేషన్ సమస్యతో తరచూ సతమతం అయ్యేవారు తప్పకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ మెలన్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు