వేసవిలో నీరసాన్ని తరిమికొట్టి తక్షణ శక్తిని అందించే మ్యాజికల్ డ్రింక్ మీకోసం!

వేసవికాలం( summer ) రానే వచ్చింది.మార్చి నెల ప్రారంభం అయిందో లేదో భానుడు భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.

అయితే వేసవి కాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో నీరసం( Boredom ) ఒకటి.ఎండల కారణంగా ప్ర‌తి ఒక్క‌రూ తరచూ నీరసానికి గురవుతుంటారు.

ఈ నీరసం వల్ల చేసే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్( magical drink ) ను కనుక తీసుకుంటే నీరసం పరార్ అవ్వడమే కాదు మీకు తక్షణ శక్తి సైతం లభిస్తుంది.

మరి ఇంత‌కీ ఈ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందు రెండు ఆరెంజ్ పండ్లను తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత బ్లెండర్ లో అరకప్పు లేత కొబ్బరి, ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు, పావు టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో ముందుగా తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ ను మిక్స్ చేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె క‌లిపితే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.

ఈ డ్రింక్‌ చాలా టేస్టీగా ఉంటుంది.అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ప్రస్తుత సమ్మర్ సీజన్ లో తరచూ వేధించే నీరసాన్ని తరిమి కొట్టడానికి ఈ డ్రింక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

అదే సమయంలో తక్షణ శక్తిని అందిస్తుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

వడ దెబ్బ కొట్టకుండా ఉంటుంది.

Advertisement

పైగా ఏ డ్రింక్ ను తీసుకోవడం వల్ల తల నొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.

మరియు ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ కావడానికి కూడా ఏ డ్రింక్ సహాయపడుతుంది.కాబట్టి ప్రస్తుత సమ్మర్ సీజన్ లో తప్పకుండా ఈ మ్యాజికల్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు