స్కూల్లో చిన్న తరగతి పిల్లలు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వింటే టీచర్లు కూడా ఫిదా అయిపోతుంటారు.
అమాయకంగా, ముచ్చట గొలిపేలా ఉండే వారి మాటలు సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడూ వైరల్ అవుతుంటాయి.
అయితే తాజాగా ఓ బుడ్డోడు హోమ్ వర్క్ అడిగిన టీచర్‌కి ఓ కాంప్లిమెంట్ ఇచ్చి పనిష్మెంట్ నుంచి తప్పించుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోకి ఇప్పటికే ఒక లక్షకు పైగా వ్యూస్, వేలాది లైకులు వచ్చాయి.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక టీచర్ క్లాస్‌రూమ్‌లో ఉండి వీడియో రికార్డ్ చేస్తుండడం గమనించవచ్చు.
ఆ టీచర్ కెమెరా ముందే స్కూల్ యూనిఫామ్ లో ఓ విద్యార్థి ఉన్నాడు.ఆ సమయంలో టీచర్ విద్యార్థులందరి వద్ద హోమ్ వర్క్ చెక్ చేస్తోంది.
అలా ఈ బుడ్డోడి వంతు కూడా వచ్చింది.ఏది నీ హోంవర్క్ అని అడిగినప్పుడు ఆ స్టూడెంట్ బిత్తిరి మొహం వేసాడు.
ఆ తర్వాత టీచర్ అడిగిన ప్రశ్నలకు పొంతన లేని మాటలు చెప్పాడు.ఆ మాటలకు ఆ లేడీ టీచర్ సంతోషంతో ఉప్పొంగిపోయింది.
ఎందుకంటే ఆ పిల్లోడు ఆమెకు కాంప్లిమెంట్ ఇచ్చాడు."మీరు చీర కట్టుకుని వచ్చినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు మేడం, మీ చీర కూడా చాలా బాగుంది.
ఈ స్కూల్ మొత్తంలో మీరే నా ఫేవరెట్ టీచర్" అని కాంప్లిమెంట్స్ ఇచ్చేశాడు.దాంతో ఆ మహిళా టీచర్ తెగ పొంగిపోయింది.
ఆ తర్వాత బాలుడికి థాంక్స్ చెప్పింది.ఈ క్యూట్ వీడియో ని మీరు కూడా వీక్షించండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy