ముఖంపై ఎలాంటి మొండి మచ్చ‌లున్నా మాయం చేసే సీర‌మ్ ఇదే!

మొటిమ‌లు, వ‌య‌సు పైబ‌డ‌టం, అదనపు నూనె ఉత్ప‌త్తి, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం, బాక్టీరియా వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ముఖంపై మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటారు.

ఆ మ‌చ్చ‌లు ఒక్కోసారి ఎన్ని చేసినా వ‌దిలి పెట్ట‌వు.

వాటినే మొండి మ‌చ్చ‌లు అని అంటారు.అయితే ఇటువంటి మొండి మ‌చ్చ‌ల‌ను మాయం చేయ‌డంలో ఇప్పుడు చెప్ప‌బోయే సీర‌మ్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఆ సీర‌మ్ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర క‌ప్పు రోజ్ వాట‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల‌ ఆరెంజ్ పీల్ పౌడ‌ర్ వేసి బాగా క‌లిపి మూత పెట్టి రోజంతా ప‌క్క‌న పెట్టేయాలి.

మ‌రుస‌టి రోజు స్ట్రైన‌ర్ సాయంతో రంగు మారిన రోజ్ వాట‌ర్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ రోజ్ వాట‌ర్ లో వ‌న్ టేబుల్ స్పూన్‌ గ్లిజ‌రిన్‌, వ‌న్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్, వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మొండి మ‌చ్చ‌ల‌ను త‌రిమికొట్టే హోమ్ మేడ్ సీర‌మ్ సిద్ధం అవుతుంది.

Advertisement

ఈ సీర‌మ్‌ను ఒక బాటిల్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేక‌ప్ మొత్తాన్ని పూర్తిగా తొల‌గించి వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై త‌యారు చేసి పెట్టుకున్న సీర‌మ్ ను ముఖానికి అప్లై చేసుకుని.

రెండంటే రెండు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు గ‌నుక చేస్తే.

ముఖంపై ఎలాంటి మొండి మ‌చ్చ‌లు ఉన్నా క్ర‌మంగా మాయం అవుతాయి.అదే స‌మ‌యంలో చ‌ర్మం తెల్ల‌గా, ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

డ్రై స్కిన్ తో స‌త‌మ‌తం అయ్యేవారికి కూడా ఈ సీర‌మ్ చాలా మేలు చేస్తుంది.ఈ సీర‌మ్‌ను రోజూ వాడితే చ‌ర్మం తేమ‌గా, నిగారింపుగా మెరుస్తుంది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు