పాము కరిచిన వెంటనే చాలామంది చేస్తున్నా అతి పెద్ద పొరపాటు ఇదే..!

వర్షాకాలం వచ్చిందంటే బయట ఎక్కువగా పాములు( snakes ) కనిపిస్తూ ఉంటాయి.వర్షాకాలంలో పాములు తమ బొరియల నుంచి బయటకు వస్తూ ఉంటాయి.

సాధారణంగా ఈ సీజన్ లో పాము కాటు ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.భారతదేశంలో ఉన్న 250 జాతుల పాములలో అన్ని పాములు విషపూరితమైనవి కావు.

కొన్ని మాత్రమే విషపూరితమైనవి.దాదాపు అన్ని రకాల పాములు విషానికి మందు ఉంటుంది.

అయినప్పటికీ పాము కాటు చాలామంది మరణించడానికి కారణం అవుతూ ఉంది.మన దేశంలో 20 సంవత్సరాల లో పాము కాటు వల్ల 12 లక్షల మందికి పైగా చనిపోయారు.

This Is The Biggest Mistake That Many People Make Immediately After Being Bitten
Advertisement
This Is The Biggest Mistake That Many People Make Immediately After Being Bitten

వారిలో 97 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు.పాముకాటుకు గ్రామీణలు చేసే నాటువైద్యం అపనమ్మకాలే చాలామంది చనిపోవడానికి కారణం అవుతున్నాయి.సాధారణంగా పాము కుట్టిన వెంటనే విషం శరీరం అంతా వ్యాపించకుండా గాయం పైన కట్టు కట్టాలని చాలామందికి తెలుసు.

పాము కాటేసింది అని తెలిసిన వెంటనే మొదట అందరూ చేసే పని అదే.కొందరు గాయానికి పైన రెండు మూడు, కట్లు కట్టి వేస్తుంటారు.కట్టు గట్టిగా కట్టి వేస్తుంటారు.

అలా చేయడం చాలా ప్రమాదం రక్త ప్రసరణ( blood circulation ) అస్సలు జరగకుండా కట్టుకొట్టడం చాలా ప్రమాదకరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలా చేయడం వల్ల పాము కాటు వేసిన చోట రక్తం నిలిచిపోయి ఆ ప్రదేశంలో కణజాలం దెబ్బతింటుంది.

అందువల్ల గ్యాంగ్రీన్, పక్షవాతం( Gangrene, paralysis ) వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.అంతేకాకుండా రోగి మరణం కూడా సంభవించవచ్చు.

This Is The Biggest Mistake That Many People Make Immediately After Being Bitten
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

పాముకాటుకు గురైన వ్యక్తిని ముందుగా తల పైకీ పడుక్కోనివ్వాలి.పాము కరిచిన భాగాన్ని కదలకుండా చూసుకోవాలి.కాళ్ళు మీద పాము కాటు వేస్తే కాళ్లు కదలకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి.

Advertisement

కాళ్ళు కదిలిస్తే విషయం శరీరం అంతా వ్యాపించే అవకాశం ఉంది.పాము కాటు వేసిన భాగాన్ని సబ్బు తో శుభ్రంగా కడగాలి.

ఆ తర్వాత ఆ భాగాన్ని శుభ్రమైన కాటన్ గుడ్డ తో శుభ్రపరచాలి.వెంటనే రోగిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకొని వెళ్ళాలి.

పాము కాటుకు గురైన గంటలోపు యాంటీ వినమ్ వ్యాక్సిన్ వేయించాలి.అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సురక్షితంగా కోలుకోగలుగుతాడు.

తాజా వార్తలు