ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు ఉత్తమ హెయిర్ టోనర్ ఇది..!

సాధారణంగా పురుషుల్లో కొందరి జుట్టు( Hair ) చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది.ఇలాంటి వారు జుట్టు విషయంలో చాలా వర్రీ అవుతుంటారు.

ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని బెంగ పెట్టుకుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే టెన్షన్ పడకుండా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ను( Homemade Hair Toner ) వాడటం స్టార్ట్ చేయండి.ఒత్తయిన జుట్టును కోరుకునే పురుషులకు ఈ హెయిర్ టోనర్ చాలా ఉత్తమమైనది.

మరి ఇంతకీ ఆ హెయిర్ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా అంగుళం అల్లం ను( Ginger ) తీసుకొని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, రెండు అంగుళాల దాల్చిన చెక్క,( Cinnamon ) రెండు స్పూన్లు టీ పౌడర్ మరియు రెండు స్పూన్లు ఎండిన రోజ్ మేరీ ఆకులు వేసి మరిగించాలి.

Advertisement

దాదాపు 15 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసి మిక్స్ చేస్తే మన టోనర్ సిద్ధం అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ లో( Spray Bottle ) తయారు చేసుకున్న టోనర్ ను నింపుకోవాలి.

ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.

అర గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా కనుక చేశారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.పల్చటి జుట్టుతో బాధపడే పురుషులకు ఈ హెయిర్ టోనర్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ టోనర్ ను వాడటం ప్రారంభించారంటే కొద్ది రోజుల్లోనే జుట్టు ఒత్తుగా మారుతుంది.కుదుళ్లు సైతం దృఢంగా తయారవుతాయి.

High Roller Tipps & Casino
Advertisement

తాజా వార్తలు