వేసవిలో డీహైడ్రేషన్ నుంచి రక్షించే సూపర్ డ్రింక్ ఇది..!

ప్రస్తుత వేసవికాలంలో( Summer ) అత్యంత కామన్ గా వేధించే సమస్యల్లో డీహైడ్రేషన్( Dehydration ) ఒకటి.

అధిక ఎండలు, ఉక్క పోత కారణంగా ఒంట్లో నీరు మొత్తం ఆవిరైపోతుంటుంది.

బాడీ డీహైడ్రేట్ అయ్యిందంటే తలనొప్పి, నీరసం, అలసట, కళ్ళు తిరగడం ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి.కాబట్టి డీహైడ్రేషన్ బారిన పడ్డాక బాధపడడం కంటే బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవడం ఎంతో మేలు.

అయితే అందుకు సహాయపడే సూపర్ డ్రింక్ ఒకటి ఉంది.అందుకోసం ముందుగా బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో రెండు కప్పులు పుచ్చకాయ ముక్కలు( Watermelon ) వేసుకోవాలి.

అలాగే గుప్పెడు పుదీనా ఆకులు,( Mint Leaves ) పావు టీ స్పూన్ అల్లం( Ginger ) తురుము, గింజ తొలగించిన ఒక ఆరెంజ్( Orange ) వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

Advertisement

ఈ జ్యూస్ ను సన్నగా తరిగిన కొన్ని పుచ్చకాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు, కావాలి అనుకుంటే ఐస్ ముక్కలు వేసుకుని తాగేయడమే.

ఈ పుచ్చకాయ ఆరెంజ్ జ్యూస్ అనేది ప్రస్తుత సమ్మర్ లో డీహైడ్రేషన్ నుంచి ర‌క్షించేందుకు అద్భుతంగా సహాయపడుతుంది.వేడి వాతావరణంలో బాడీని హైడ్రేట్‌ గా ఉంచుతుంది.ఈ జ్యూస్ లోని అధిక నీటి శాతం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో మరియు ద్రవ సమతుల్యతను కాపాడ‌టంలో తోడ్ప‌డుతుంది.

అలాగే పుచ్చకాయ ఆరెంజ్ జ్యూస్ నీర‌సం, అల‌స‌ట‌కు చెక్ పెడుతుంది.రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.ఈ జ్యూస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి.

చ‌ర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

అంతేకాదు, పుచ్చకాయలో సిట్రుల్లైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, కండరాల నొప్పిని తగ్గిస్తుంది.వ్యాయామం తర్వాత కోలుకోవడానికి సహాయపడుతుంది.కాబ‌ట్టి మార్నింగ్ వ్యాయామం చేశాక పైన చెప్పిన విధంగా పుచ్చకాయ ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోండి.

Advertisement

లేదా బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో తీసుకున్న కూడా చాలా మంచిది.

తాజా వార్తలు