బలహీనంగా ఉన్నారా.. అయితే ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ మీకోసమే!

సాధారణంగా ఒక్కోసారి చాలా బలహీనంగా( Weakness ) మారుతుంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.

అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కష్టతరంగా మారుతుంటుంది.అయితే అలాంటి సమయంలో శరీరానికి తిరిగి శక్తిని అందించేందుకు, బలహీనతను హరించేందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్‌ మేడ్ ప్రోటీన్ పౌడర్( Homemade Protein Powder ) అద్భుతంగా సహాయపడుతుంది.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పులు ఫూల్ మఖానా( Phool Makhana ) వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు బాదం గింజలు,( Badam ) అర కప్పు నువ్వులు, అరకప్పు సోంపు విడివిడిగా వేయించి చల్లార పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న మఖానా, బాదం, సోంపు మరియు నువ్వులు వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన ప్రోటీన్ పౌడర్ అనేది రెడీ అవుతుంది.

Advertisement
This Is A Homemade Protein Powder That Cures Weakness Details, Weakness, Homemad

ఒక బాక్స్ లో ఈ పౌడర్ ను నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.

This Is A Homemade Protein Powder That Cures Weakness Details, Weakness, Homemad

ఇకపోతే ఈ ప్రోటీన్ పౌడర్ ను రోజుకు వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి.నిత్యం ఈ విధంగా చేశారంటే ఎలాంటి బలహీనత అయినా పరార్ అవుతుంది.శరీరానికి అవసరమైన పోషకాలను అందించి.

నీర‌సం, అలసట తగ్గించడంలో సహాయపడుతుంది.అలాగే ఈ ప్రోటీన్ పౌడర్ ఎముకల్లో సాంద్రతను పెంచుతుంది.

కీళ్ల నొప్పుల బారిన పడకుండా రక్షిస్తుంది.

This Is A Homemade Protein Powder That Cures Weakness Details, Weakness, Homemad
కెనడాలో భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్యకు గట్టి షాక్!
ఒంటికి వెయ్యి ఏనుగుల బ‌లం రావాలంటే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇది ఉండాల్సిందే!

అంతే కాదండోయ్, నిత్యం ఈ ప్రోటీన్ పౌడర్ ను తీసుకోవడం వల్ల అందులోని అమైనో యాసిడ్లు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, స్ట్రెస్ తగ్గిస్తాయి.బ్రెయిన్ ను షార్ప్ గా మారుస్తాయి.ఆలోచన శక్తి, జ్ఞాపకశక్తిని రెట్టింపు చేస్తాయి.

Advertisement

పైగా ఈ ప్రోటీన్ పౌడ‌ర్ ను రెగ్యుల‌ర్ గా తీసుకుంటే ఆకలి తగ్గి, అధిక కొవ్వు తగ్గించుకోవడానికి కూడా తోడ్ప‌డుతుంది.

తాజా వార్తలు