స్ట్రైట్ అండ్ సిల్కీ హెయిర్ ను కోరుకుంటున్నారా.. అయితే మీకోసమే ఈ రెమెడీ!

సాధారణంగా అమ్మాయిలు చాలా మంది స్ట్రైట్ అండ్ సిల్కీ హెయిర్( silky hair ) కోరుకుంటారు.ఎందుకంటే అటువంటి జుట్టు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

అందుకే స్ట్రైట్ అండ్ సిల్కీ జుట్టు కోసం వేలకు వేలు ఖర్చుపెట్టి హెయిర్ స్పా చేయించుకుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే అటువంటి జుట్టును పొందవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటించారంటే సులభంగా మీ జుట్టును సిల్కీగా మరియు స్ట్రైట్ గా మార్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక కలబంద ఆకు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో ఒక చిన్న కప్పు రైస్ వేసుకోవాలి.అలాగే కలబంద ముక్కలు మరియు కొన్ని బియ్యం కడిగిన నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ క్రీమ్ లో అర కప్పు ఫ్రెష్ కొబ్బరిపాలు, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Ricinus ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.

40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.అలోవెరా, రైస్, రైస్ వాటర్, కొబ్బరి పాలు( Coconut milk ), కొబ్బరి నూనె, ఆముదం ఇవన్నీ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.

జుట్టు స్ట్రైట్ గా మరియు సిల్కీగా మారేలా ప్రోత్సహిస్తాయి.అలాగే హెయిర్ ఫాల్ ను అడ్డుకుంటాయి.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేస్తాయి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

మూలాల నుంచి జుట్టును బలోపేతం చేస్తాయి.కాబట్టి పైసా ఖర్చు లేకుండా స్ట్రైట్, సిల్కీ అండ్ హెల్తీ హెయిర్ ను కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు