బ్రెయిన్ షార్ప్‌గా ప‌ని చేయాలా.. అయితే ఇవి తినాల్సిందే!

ఇటీవ‌ల కాలంలో చిన్న వ‌య‌సుకే జ్ఞాప‌క శ‌క్తిని కోల్పోతున్నారు.అర‌వై, డ‌బ్బై ఏళ్ల‌లో వ‌చ్చే స‌మ‌స్య నేటి అధునిక యుగంలో మూప్పై ఏళ్లకే  వ‌స్తుంది.

బ్రెయిన్ లేదా మెద‌డు ప‌ని తీరు మంద‌గించ‌డం వ‌ల్ల జ్ఞాప‌క శ‌క్తి లోపిస్తుంటుంది. మెద‌డు ప‌ని తీరు త‌గ్గితే.

This Food Must Be Consumed To Improve Brain Function! Good Food, Brain Function,

ఏ ప‌నిపైనా ఏకాగ్ర‌త ఉండ‌దు.ఆలోచ‌నా శ‌క్తి త‌గ్గిపోతుంటుంది.

అందుకే మెదడు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అయితే బ్రెయిన్ షార్ప్‌గా ప‌ని చేయాలంటే.

Advertisement

మనం తీసుకునే ఆహారంపైనా ప్రధానంగా దృష్టి పెట్టాలి.ముఖ్యంగా కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల మెద‌డు షార్ప్‌గా మ‌రియు యాక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

మ‌రి ఆ ఆహారాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఆకుకూరలు అంటే పాల‌కూర‌, తోట‌కూర‌, బచ్చలికూర, బ్రకోలీ, ముల్లంగి, మెంతికూర వంటివి  డైట్‌లో చేర్చుకుంటే.

అందులో ఉండే పోష‌కాలు మెద‌డును  ప‌నితీరును మెరుగుప‌రుస్తుంది.అలాగే వారినికి క‌నీసం రెండు సార్లు లేదా ఒక‌సారి అయినా చేప‌లు తినాలి.

ఎందుకంటే, చేప లో  ఉండే మేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.బ్రెయిన్ షార్ప్‌గా ప‌ని చేసేలా స‌హాయ‌ప‌డుతుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఇక చాలా మంది ర‌క‌ర‌కాల నూనెల‌తో త‌యారు చేసిన వంట‌లు తింటుంటారు.కానీ, ఏవేవో నూనెలు బ‌దులుగా ఆలివ్ ఆయిల్‌ను ఎంచుకోవ‌డం మంచిది.

Advertisement

ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫోలిఫినాయిల్స్ మెద‌డు ప‌నితీరును మెరుగుప‌రుస్తుంది.అలాగే ప‌సుపును రెగ్యుల‌ర్‌గా ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.

ప‌సుపు మెద‌డు చురుగ్గా ప‌ని చేసేలా చేయ‌డంతో పాటు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంపొందిస్తుంది.ఇక ప్ర‌తి రోజు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

మ‌రియు శ‌రీరానికి కావాల్సిన ప్రోటీన్ల‌ను ఖ‌చ్చితంగా అందేలా చూసుకోవాలి.అలాగే ప్ర‌తి రోజు పాలు, పెరుగు, గుడ్లు, న‌ట్స్ తీసుకోవాలి.

ఇక బ్లూబెర్రీస్, అవకాడో, అరటి పండు, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లు  బ్రెయిన్‌ను షార్ప్‌గా ప‌నిచేసేలా చేస్తాయి.ఇక మెదడు చురుగ్గా పనిచేయాలంటే డైట్‌లో డార్క్ చాక్లెట్స్ కూడా చేర్చుకోవాలి.

తాజా వార్తలు