చిన్న పిల్లలు చేసే కొన్ని పనులు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.కొందరు చిన్న వయసులోనే చెస్ లో ఛాంపియన్ కాగలరు.
మరికొందరు అద్భుతమైన జ్ఞాపకశక్తి తో ఎలాంటి విషయాన్నైనా గుర్తు పెట్టుకోగలరు.ఇంత చిన్న వయసులో ఇలాంటి కష్టతరమైన పనులు చేసే పిల్లలను చూసి అని ఆశ్చర్య పోవడం మన వంతు అవుతుంది.
తాజాగా ఓ చిన్న పిల్లోడు కూడా తన బై బర్త్ టాలెంట్‌తో అందరి చేత వావ్ అనిపిస్తున్నాడు.ఈ పిల్లోడు అద్భుతమైన ప్రతిభకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఈ వీడియోని TansuYegen ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయగా దానికి ఇప్పటికే రెండు లక్షల వరకు వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోలో ఒక బుడ్డోడు ఒక రూమ్‌లోని డెస్క్ పైకి స్పైడర్ మ్యాన్ లాగా క్షణాల్లోనే ఎక్కడం చూడొచ్చు.
ఆ తర్వాత కనిపించిన ప్రతి బల్లాన్ని చకచకా ఎక్కేస్తూ కనిపించాడు.చూసేందుకు చాలా చిన్నగా ఉన్నా చాలా చురుకుగా జంప్స్ చేస్తూ టేబుల్స్ ఎక్కేస్తున్న ఈ బుడ్డోడికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
"గోడలు, బల్లలు ఇంకా ఏదైనా ఎక్కాలంటే ఈ పిల్లాడు ఉపయోగిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది" అని TansuYegen ట్విట్టర్ అకౌంట్ ఒక క్యాప్షన్ జోడించింది.ఈ బుల్లోడి వయసు ఒక సంవత్సరం రెండు నెలలు అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
నిజంగా అంత చిన్న వయసులో ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అతడు పెద్ద చిచ్చరపిడుగు అని చెప్పవచ్చు.ఈ బుల్లోడు పెద్దయితే మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కేస్తాడని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.
అయితే ఇలా కనిపించిందల్లా ఎక్కేయడం చాలా రిస్క్ అని కొందరు అంటున్నారు.ఇలాంటి డెస్క్స్ ఎక్కాక పైనుంచి పిల్లోడు కింద పడితే చాలా గాయాలు అవుతాయని అంటున్నారు.
ఏమైనా తల్లిదండ్రులు ఈ పిల్లోడిని అనునిత్యం సంరక్షించుకోవడం చాలా ముఖ్యం.అయితే ఈ వీడియో చూసిన మరికొందరు షాక్ అవుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy