రైలు ఎక్కేముందు డ్రైవర్‌కు ప్రతిసారీ ఈ పరీక్షలు.. ఉత్తీర్ణత సాధిస్తేనే..

ఒక రైలు స్టేషన్ నుండి బయలుదేరి.గమ్యస్థానానికి చేరుకునే వ‌ర‌కూ లోకో పైలట్‌పైనే అధిక బాధ్య‌త‌లు ఉంటాయి.

లోకో పైలట్ అంటే లక్షల టన్నుల సరుకులు లేదా వేల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే బాధ్య‌త క‌లిగిన వ్యక్తి.లోకోపైల‌ట్‌.

These Tests For The Driver Every Time Before Boarding The Train Passengers Route

రైలు బ‌య‌లుదేరే ముందు పరీక్షలు చేయించుకోవాలి.ఆ తర్వాత మాత్రమే రైలును నడపడానికి అనుమతిస్తారు.

మొదటిది లోకో పైలట్ తన హాజరు సంబంధిత పనిని పూర్తి చేయాలి.రైలు రూట్ మ్యాప్ తదితర పూర్తి సమాచారంతోపాటు రైలుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు అత‌నికి అందజేస్తారు.

Advertisement

దీని తరువాత అతనికి ఆల్కహాల్ పరీక్ష జరుగుతుంది.ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే లోకో పైలట్ రైలు ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి అనుమతిస్తారు.

రైలును నడపడానికి ముందు లోకో పైలట్.రైలు ఇంజిన్‌ను తనిఖీ చేయాలి.

ఇంజిన్‌లో ఏదైనా లోపం ఉందా అని అతను ఇంజిన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాడు.లోపాలు ఉంటే ముందుగానే అధికారుల‌కు తెలియ‌జేస్తాడు.

లోపాలు స‌రిచేసిన అనంత‌రమే ఇంజిన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.రైలు కదులుతున్న సమయంలో ఇద్దరు లోకో పైలట్లు సిగ్నల్‌కు సంబంధించి సమన్వయం పాటిస్తారు.

అజీర్తికి ఔషధం పుదీనా.. ఇలా తీసుకున్నారంటే క్షణాల్లో రిలీఫ్ మీ సొంతం!

లోకో పైలట్ ఉద్యోగం చాలా బాధ్యతతో కూడుకున్నది.పరధ్యానంలో లేకుండా నిరంతరం రైలును పర్యవేక్షించవలసి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు