బాలీవుడ్ ను డామినేట్ చేయాలంటే మనకి ఈ సక్సెస్ లు తప్పనిసరి...

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి పాన్ ఇండియా సినిమాలు గుర్తుకొస్తున్నాయి.

ప్రస్తుతం మన దర్శకులందరు చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా(Pan India) సినిమాలే కావడం విశేషం.

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు పాన్ ఇండియా బాట పడుతూ ముందుకు సాగుతున్నారు.ఇక స్టార్ హీరోలందరు మంచి విజయాలను సాధిస్తూ వాళ్ళ మార్కెట్ ను పెంచుకుంటుంటే మీడియం రేంజ్ హీరోలు సైతం స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

రోజురోజుకి హీరోల మధ్య పోటీతో పాటు దర్శకుల మధ్య పోటీ కూడా ఎక్కువ అయిపోతుంది.మరి ఆ పోటీని రసవత్తరంగా మార్చడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు ఒకరికి మించి మరొకరు మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇలాంటి పోటీ వాతావరణం ఉంటే మంచి సినిమాలు వస్తాయని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.మన హీరోలు మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది.

Advertisement

ఇప్పటికే మన స్టార్ హీరోలు మంచి విజయాలను అందుకుంటుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో (Bollywood industry)ఉన్న స్టార్ హీరోలు మాత్రం వెనకబడి పోతున్నారు.కాబట్టి మన ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు భారీ విజయాలను సాధిస్తున్నాయి.మరి ఆ విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది.

బాలీవుడ్ ఇంట్రెస్ట్ ని దెబ్బ కొట్టాలంటే మన నుంచి మరిన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలు రావాల్సి ఉంది.అలా వచ్చినప్పుడు మాత్రమే మన ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ ని డామినెట్ చేసి నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్తుంది లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుందనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు