సిజేరియ‌న్ త‌ర్వాత త్వ‌ర‌గా కోలుకోవాలంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

ప్ర‌స్తుత రోజుల్లో సిజేరియ‌న్‌(సి-సెక్ష‌న్‌) డెలివ‌రీలు చాలా కామ‌న్ అయిపోయాయి.

అనారోగ్య స‌మ‌స్య‌ల వల్ల‌నో లేక నార్మ‌ల డెలివ‌రీతో వ‌చ్చే నొప్పుల‌ను భ‌రించ‌లేకో మ‌న దేశంలో ఎక్కువ శాతం సిజేరియ‌న్ వైపే మొగ్గు చూపుతున్నారు.

సిజేరియన్ డెలివ‌రీ( Cesarean Delivery ) త‌ర్వాత శ‌రీరం పూర్తిగా కోలుకోవ‌డానికి కొంత స‌మ‌యం అవసరం.అయితే కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సిజేరియన్‌ తర్వాత త‌ల్లికి విశ్రాంతి అనేది చాలా అంటే చాలా అవ‌స‌రం.ముఖ్యంగా 6 వారాల వరకు భారంగా ఉన్న పనులను పూర్తిగా ఎవైడ్ చేసి త‌గినంత విశ్రాంతి తీసుకోవాలి.

బిడ్డను తప్ప ఎటువంటి బ‌రువులు ఎత్తకండి.అలాగే చాలా మంది ఫుడ్ విష‌యంలో డెలివ‌రీకి ముందు తీసుకునే శ్ర‌ద్ధ డెలివ‌రీ త‌ర్వాత తీసుకోరు.

Advertisement
These Precautions Are Essential For A Quick Recovery After A C-Section Details,

కానీ సిజేరియ‌న్ అయ్యాక త్వ‌ర‌గా కోలుకోవాలంటే స‌రైన ఆహారం తీసుకోవ‌డం ఎంతో ముఖ్యం.

These Precautions Are Essential For A Quick Recovery After A C-section Details,

ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్ సి పుష్క‌లంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పాల ఉత్పత్తులు, నువ్వులు, గింజలు, పప్పులు, బీట్‌రూట్, ఖర్జూరాలు, బ్రోకోలీ వంటి పోష‌కాహారం తీసుకోండి.నీరు ఎక్కువగా తాగండి.

ఎక్కువ ఆయిలీ, మసాలా ఆహారాల‌కు దూరంగా ఉండండి.కాఫీ, టీ, సోడాలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, సలాడ్లు, రా ఎగ్స్ జోలికి అస్స‌లు పోకండి.

These Precautions Are Essential For A Quick Recovery After A C-section Details,

డెలివ‌రీ త‌ర్వాత చిన్న చిన్న నడకలు ప్రారంభించండి.త‌ద్వారా రక్తప్రసరణ( Blood Circulation ) మెరుగుపడుతుంది, గ్యాస్ సమస్య తగ్గుతుంది.మీ డాక్టర్ అనుమ‌తిస్తే యోగా లేదా ప్రాణాయామం వంటివి కూడా చేయ‌వ‌చ్చు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

సిజేరియ‌న్ త‌ర్వాత త్వ‌ర‌గా కోలుకోవాలంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి.బేబీ బ్లూస్, మూడ్ స్వింగ్స్ వస్తే కుటుంబం మ‌రియు డాక్టర్‌కు చెప్పండి.

Advertisement

వైద్యులు చెప్పిన పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ టైమ్ కి తీసుకోండి.డెలివ‌రీ త‌ర్వాత కొంద‌రు బ్రెస్ట్ ఫీడింగ్ ను ఎవైడ్ చేస్తారు.

కానీ ప్ర‌స‌వం నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి, కుట్లు వేగంగా మానిపోవ‌డానికి, వెంట‌నే మ‌ళ్లీ గ‌ర్భం దాల్చ‌కుండా ఉండేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ చాలా బాగా స‌హాయ‌ప‌డుతుంది.అందుకే బ్రెస్ట్ ఫీడింగ్ ఎవైడ్ చేయ‌కూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు