చెరుకు ర‌సంలో ఇవి క‌లిపి తాగితే.. జ‌లుబు, ద‌గ్గు ప‌రార‌వ్వాల్సిందే!

చ‌లి కాలం ప్రారంభం అయింది.ఈ సీజ‌న్‌లో విరి విరిగా ల‌భించే వాటిల్లో చెరుకు ఒక‌టి.

మ‌ధుర‌మైన రుచిని క‌లిగి ఉండే చెరుకును పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ ఇష్టంగా తింటారు.ముఖ్యంగా చెరుకు ర‌సాన్నైతే ఇష్ట ప‌డ‌ని వారు ఉండ‌నే ఉంటారు.

చెరుకు ర‌సం రుచిగా ఉండ‌ట‌మే కాదు.ఎన్నో పోష‌కాల‌నూ క‌లిగి ఉంటుంది.

అందు వ‌ల్ల‌నే చెరుకు ర‌సం ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అయితే చెరుకు ర‌సంతో కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌నూ నివారించుకోవ‌చ్చు.

Advertisement
These Can Be Mixed With Sugarcane Juice To Reduce Cold And Cough! Sugarcane Juic

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ప్ర‌స్తుత ఈ సీజ‌న్‌లో చాలా మంది జులుబు, ద‌గ్గు స‌మ‌స్య‌ల‌తో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతుంటారు.

అయితే అలాంటి స‌మ‌యంలో ఒక గ్లాస్ చెరుకు ర‌సంలో ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి క‌లిపి కొద్ది సేపు స్లో ఫ్లేమ్‌పై హీట్ చేయాలి.ఆపై గోరువెచ్చ‌గా అవ్వ‌నిచ్చి అప్పుడు ఈ డ్రింక్‌ను సేవిస్తే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

These Can Be Mixed With Sugarcane Juice To Reduce Cold And Cough Sugarcane Juic

అలాగే కొంద‌రు మూత్ర విస‌ర్జ‌న స‌మ‌యంలో మంట, నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే వాటిని ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క తెగ మ‌ద‌న ప‌డి పోతూ ఉంటాయి.అయితే అర గ్లాస్ చెరుకు ర‌సంలో అర గ్లాస్ కొబ్బ‌రి నీళ్లు, ఒక స్పూన్ అల్లం ర‌సం క‌లిపి సేవిస్తే.

మూత్ర విస‌ర్జ‌న స‌మ‌యంలో వ‌చ్చే మంట, నొప్పి త‌గ్గుతుంది.అదే స‌మ‌యంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా క్యూర్ అవుతుంది.ఇక ఈ మధ్య పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రో ర‌క్త హీన‌త బారిన ప‌డి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

అయితే అలాంటి వారు.ఒక గ్లాస్ చెరుకు ర‌సంలో ఒక టేబుల్ స్పూన్ స్వ‌చ్ఛ‌మైన తేనె, ఒక స్పూన్ ఉసిరి కాయ‌ల జ్యూస్ క‌లుపుకుని సేవించాలి.

Advertisement

త‌ద్వారా ర‌క్త వృద్ధి జ‌రిగి ర‌క్త హీన‌త త‌గ్గు ముఖం ప‌డుతుంది.

తాజా వార్తలు