ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల గురించి మీకు తెలుసా?

ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో నగరాలు అత్యంత కీర్తిని గడించాయి.అందుకే వాటిని చూడడానికి ఎంతోమంది పర్యాటకులు ప్రతి ఏటా వెళుతూ వుంటారు.

అంటువంటి నగరాల్లో మొదటి స్థానంలో వున్నది న్యూయార్క్ నగరం.( New York ) ఇది అత్యంత ఖరీదైన నగరంగా గుర్తింపు పొందింది.

ప్రపంచంలోని అపర కుబేరులు అనబడేవారు కూడా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివసించాలంటే ముందుగా లెక్కలు వేసుకుంటారంటే అక్కడి కాస్ట్ అఫ్ లివింగ్( Cost Of Living ) ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.అందుకే ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ నగరంగా న్యూయార్క్ నిలిచింది.

న్యూయార్క్ తర్వాత చూసుకుంటే స్విట్జర్లాండ్ లోని జెనీవా( Geneva ) నగరం అత్యంత ఖరీదైన 2వ నగరంగా నిలిచింది.పర్యాటకులకు అత్యంత ప్రియమైన పట్టణమిది.ఇక్కడ పర్యాటకులు లేదంటే ట్రిప్ మీద వెళ్లేటువంటి వ్యాపారులు ఒక్క రోజు జీవించేందుకు $700 అంటే అక్షరాలా రూ.57874 రూపాయిలు అవసరం పడతాయట.ఇక ఈ లిస్టులో 3వ స్థానంలో నిలిచింది అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ. ఇక్కడ ఒక రోజుకు $658 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.54401లు కావాలట.అదేవిధంగా 4వ స్థానంలో మరో స్విట్జర్లాండ్ నగరమైన జ్యురిచ్ నిలిచింది.ఈ సిటీలో ఒక రోజుకు $641 (రూ.52996)లు అవసరం పడతాయి అంటే మీరు అర్ధం చేసుకోండి.

Advertisement

అంతేకాకుండా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం విషయానికొస్తే ఇక్కడ ఒక్క రోజుకి గాను $609 డాలర్లు అంటే దాదాపుగా రూ.50,350లు వెచ్చించాల్సి వస్తుంది.ఇక ఇజ్రాయెల్ నగరం టెల్ అవివ్ ( Tel Aviv ) ఖరీదైన నగరాల్లో 6వ స్థానంలో నిలిచింది.

అదే విధంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఎంజిల్స్ నగరం 7వ స్థానంలో, ఇంగ్లండ్ రాజధాని లండన్ 8వ స్థానంలో నిలిచాయి.ఇక మధ్య ఆఫ్రికా దేశమైన అంగోలా రాజధాని నగరం లువాండా ఈ లిస్టులో 9వ స్థానంలో చేరింది.

ఇక ఆఖరిగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఈ లిస్టులోని 10వ స్థానంలో చేరింది.ఈ ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టాలంటే ప్రతి రోజూ $557 అంటే రూ.46,051 అవసరం పడతాయట.

అలోవెరా ఆయిల్‌.. వారంలో 2 సార్లు రాస్తే జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!
Advertisement

తాజా వార్తలు