ఎండాకాలంలో డయాబెటిస్ తో బాధపడేవారు పాటించాల్సిన చిట్కాలు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.డయాబెటిస్( Diabetes ) ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసుకోవడం ఎంతో ముఖ్యం.

ఎండాకాలంలో కొన్ని రకాల చిట్కాలను అనుసరిస్తే షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉంటాయి.ఆరోగ్య నిపుణులు ఈ అద్భుతమైన చిట్కాను చెబుతున్నారు.

ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఎండాకాలంలో( summer season ) డయాబెటిస్ ఉన్నవారు అధిక ఉష్ణోగ్రత కారణంగా అలసట, ఎండ దెబ్బ ( sunburn )వంటి వాటికీ త్వరగా గురవుతూ ఉంటారు.

చెమట గ్రంధులపై( Sweat glands ) కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.అధిక చక్కెర స్థాయిల వల్ల ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది.

Advertisement

దీని వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లు శరీరం నుంచి ఎక్కువ నీటిని కోల్పోతుంటారు.

దీని వల్ల డిహైడ్రేషన్ సమస్య ( Dehydration )కూడా ఉంటుంది.టైప్ 1 డయాబెటిస్ తో బాధపడేవారు ఇన్సులిన్ మోతాదుని నియంత్రించడానికి చక్కెర స్థాయిలను మరింత తరచుగా చెక్ చేసుకుంటూ ఉండడం మంచిది.అయితే డయాబెటిస్ తో బాధపడేవారు వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఎండాకాలంలో తాజా పండ్లను తీసుకుంటూ ఉండాలి.అంతే కాకుండా ఒక వేళ పండ్ల రసాలను తాగాలనుకుంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు.హైడ్రేట్ గా ఉండడానికి నీళ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

నీరు బాగా తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.నీటి శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

అంతే కాకుండా బెడ్, తృణధాన్యాలు, గింజలు, పండ్లు, గుమ్మడికాయ, క్యారెట్, టమాటో వంటి వాటిని తీసుకుంటూ ఉండడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.అంతే కాకుండా ఉదయం సాయంత్రం ఒక అరగంట పాటు సాధారణ వ్యాయామం లేదా నడక వంటి వంటివి చేస్తూ ఉండాలి.ఎండాకాలంలో డయాబెటిస్ తో బాధపడేవారు ఈ చిట్కాలను తప్పకుండా పాటించడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Advertisement

తాజా వార్తలు