చిరంజీవి రవితేజ కెరియర్ లో జరిగిన సేమ్ సంఘటనలు ఇవే...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరో ల్లో చాలామంది హీరో లు మొదట చాలా ఇబ్బంది పడి ఇప్పుడు స్టార్ హీరోలు గా ఎదిగిన వ్యక్తులు అనే విషయం మనందరికీ తెలిసిందే.నిజానికి ఈ విషయం లో మన హీరో లని మెచ్చుకోవచ్చు కానీ ఒక్క విషయం ఏంటంటే అప్పుడు కష్టపడుతూ వచ్చిన ప్రతి వేషాన్ని కూడా సద్వినియోగ పరుచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన హీరో లు చాలా మందే ఉన్నారు అలాంటి వాళ్లలో చిరంజీవి( Chiranjeevi ) మొదటి స్థానం లో ఉంటె రవితేజ ( Ravi Teja )రెండో స్థానం లో ఉంటాడు.

These Are The Same Events That Happened In The Career Of Chiranjeevi Ravi Teja,

ఈ ఇద్దరు కూడా మంచి టాలెంట్ ఉన్న హీరో లు కావడం విశేషం.ఇక ఈ ఇద్దరిలో ఉన్న సేమ్ క్వాలిటీస్( Same qualities ) ఏంటంటే వీళ్ళిద్దరు కూడా వాళ్ల పేర్లని మార్చుకున్నారు.ఇక ఇద్దరు కూడా కెరియర్ మొదట్లో కొన్ని సినిమాల్లో విలన్లు గా నటించారు.

చిరంజీవికి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అలాగే రవితేజ కి కూడా మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.ఇలా వీళ్ళిద్దరిలో చాలా పాయింట్స్ ఒకేలా ఉన్నాయి.

అందుకే ఇద్దరుకూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు గా ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్నారు.

These Are The Same Events That Happened In The Career Of Chiranjeevi Ravi Teja,
Advertisement
These Are The Same Events That Happened In The Career Of Chiranjeevi Ravi Teja,

నిజానికి రవితేజ చిరంజీవి ఫ్యాన్ అనే విషయం మనకు తెలిసిందే.ఆయన ఇచ్చిన స్ఫూర్తి తోనే రవితేజ ఇండస్ట్రీ కి రావడం జరిగింది.ఇక వీళ్లిద్దరు రీసెంట్ గా వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) సినిమాలో కూడా కలిసి నటించారు.

ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది అయితే ఈ సినిమా మొత్తం లో వీళ్లిద్దరు కలిసి నటించిన సీన్స్ మాత్రం చాలా హైలెట్ గా ఉన్నాయని అందరు చెప్తూ ఉంటారు.అయితే ప్రస్తుతం ఇద్దరు కూడా సీనియర్ హీరో ల లిస్ట్ లోకి చేరిపోయినప్పటికీ వీళ్లిద్దరు కూడా వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు