భారతదేశంలోనే అత్యంత అందమైన సముద్రాలు ఇవే

ప్రపంచంలో మనుషులు జీవించేది ప్రాంతం కొంతశాతం మాత్రమే ఉంది.ఎక్కువ ప్రాంతంలో అడవులు, సముద్రాలు, కొండలు ఉన్నాయి.

ఇక్కడ మనుషులు జీవించలేరు.అయితే ప్రపంచంలోనే భారతదేశంలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంది.

చాలా రాష్ట్రాల్లోనూ సముద్ర తీర ప్రాంతం ఉంది.దీంతో భారతదేశంలోని అత్యంత అందమైన సముద్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అండమాన్, నికోబార్ దీవుల్లో( Andaman , Nicobar Islands ) సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది.సూర్యాస్తమయం సమయంలో మరింత అందంగా కనిపిస్తుంది.

Advertisement

వేసవి సెలవుల్లో ఇక్కడికి స్నేహితులతో కలిసి వెళితే బాగా ఎంజాయ్ చేయవచ్చు.సముద్రం మధ్యలో అండమాన్ నికోబార్ ఉంటుంది.

దీంతో తెల్లటి ఇసుక, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.సన్ బాత్ చేయడానికి ఇది మంచి ప్లేస్ అని చెప్పవచ్చు.

ఇక పుదుచ్చేరిలోని రాక్ బీచ్( Rock Beach ) కు పర్యాటకులు బాగా వస్తుంటారు.బంగాళాఖాతం వెంబడి ఉన్న ప్రసిద్ద బీచ్ ఇది.పాండిచ్చేరిలో 1.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.కుటుంబంతో కలిసి ఇక్కడికి వెళితే సరదాగా గడపవచ్చు.

ఇక చెన్నైలోని బెసెంట్ నగర్ పరిసరాల్లో ఉన్న ఇలియట్ బీచ్( Elliott Beach ) కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.దీని ఒడ్డున అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అనే టెంపుల్ ఉంటుంది.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?

చెన్నై నుంచి 14 కిలోమీర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది.ఇక్కడి సమీపంలో అష్టలక్ష్మి ఆలయం ఉంటుంది.

Advertisement

ఇక కొచ్చిలో చాలా బీచ్ లు ఉన్నాయి.బీచ్ లతో పాటు అందమైన కొబ్బరి చెట్లు ఉంటాయి.కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుంటం జిల్లాలోని అత్యంత జనాభా కలిగిన పట్టణం ఇది.అరేబియా సముద్రపు మహరాణిగా పిలవబడే కొచ్చి 14వ శతాబ్ధం నుంచే సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి అనుకూలంగా ఉండేది.ఇలా భారతదేశంలోనే అందమైన బీచ్ లు చాలా ఉన్నాయి.

" autoplay>

తాజా వార్తలు