బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు అస్స‌లు చేయ‌కూడ‌ని త‌ప్పులు ఇవే!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవిశైలి, వ్యాయామాలు చేయ‌క‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బ‌రువు పెరిగి పోతుంటారు.

ఇక ఈ అధిక బ‌రువు స‌మ‌స్య‌ను దూరం చేసుకునేందుకు ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.కొంద‌రు తిన‌డం మానేసి మ‌రీ బ‌రువు త‌గ్గిపోవాల‌ని భావిస్తుంటారు.

చెమ‌ట‌లు క‌క్కేలా ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ బ‌రువు త‌గ్గ‌కుంటే.

బాధ ప‌డిపోతుంటారు.అయితే నిజానికి బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారు కొన్ని కొన్ని త‌ప్పుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చేయ‌కూడ‌దు.

Advertisement
These Are The Mistakes That Those Who Want To Lose Weight Should Not Make At All

మ‌రి ఆ త‌ప్పులు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం. లేట్ నైట్ డిన్న‌ర్‌.

అవును బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఎప్పుడు కూడా ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌కూడ‌దు.అంటే ప్ర‌తి రోజు ఏడు గంట‌ల‌లోనే డిన్న‌ర్ చేసేయాలి.

అలాగే ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో ఏవేవో ఆహారాన్ని తీసుకుంటుంటారు.కానీ, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఖ‌చ్చితంగా ఉద‌యం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి.

These Are The Mistakes That Those Who Want To Lose Weight Should Not Make At All

ప్రోటీన్లు పుష్క‌లంగా ఉండే ఆహారాన్ని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే.రోజంతా ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి.నేటి కాలంలో చాలా మందికి మ‌ద్యం సేవించే అలవాటు ఉంటుంది.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

కానీ, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు మ‌ద్యానికి దూరంగా ఉండ‌ట‌మే మంచిది.మ‌ద్య‌మే కాదు.

Advertisement

కూల్ డ్రింక్స్‌, సోడాలు వంటి కూడా తీసుకోరాదు.అలాగే చాలా మంది చేసే పొర‌పాటు.

ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసేసుకుంటారు.కానీ, బ‌రువు త‌గ్గాల‌నుకుంటే మాత్రం చాలా త‌క్క‌వ మోతాదులో ప్ర‌తి మూడు గంట‌ల‌కు ఒక‌సారి ఆహారాన్ని తీసుకోవాలి.

ఇక చాలా మంది బ‌రువు త‌గ్గాల‌నే కుతూహ‌లంతో ఏకంగా తిన‌డ‌మే మానిసి.క‌డుపు మాడ్చుకుంటారు.

వాస్త‌వానికి అలా ఎట్టి ప‌రిస్థితుల్లో చేయ‌రాదు.ఆహారం తీసుకోవాలి.

అయితే అందులో పిండిప‌దార్థాలు చాలా త‌క్కువ‌గా.ఫైబ‌ర్‌, ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి.

నీళ్లు త‌క్కువ‌గా తీసుకున్నా.బ‌రువు త‌గ్గ‌రు.

కాబ‌ట్టి, ప్ర‌తి రోజు క‌నీసం నాలుగు లీట‌ర్ల నీటిని తీసుకోవాలి.

తాజా వార్తలు