దేవుడికి ప్రసాదం పెట్టే సమయంలో చేయకూడని తప్పులు ఇవే..!

హిందూ ధర్మంలో దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు.అలాగే కొంతమంది వారాల్లో చేసుకుంటే మరి కొంత మంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు.

అయితే ఏదైనా పెద్ద పూజావ్రతాలు లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పవిత్రమైన తేదీ సమయం చూసుకొని చేస్తారు.అయితే పూజలు చేయడానికి మంచి ముహూర్తాలు, తేదీలు ఉంటే సరిపోదు.

దాంతో పాటు పూజ చేసే విధానం కూడా చాలా ముఖ్యం.దాదాపు చాలామంది తెలిసో, తెలికో పూజ చేసేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు.

చాలామందికి ప్రసాదాలు( Prasadam ) ఎప్పుడు సమర్పించాలో కూడా తెలియదు.మరి పూజ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

These Are The Mistakes That Should Not Be Made While Offering Prasad To God, Poo
Advertisement
These Are The Mistakes That Should Not Be Made While Offering Prasad To God, Poo

ఇంట్లో దేవునికి ప్రసాదం నివేదించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.దేవుడికి ప్రత్యేకంగా ప్రసాదం చేస్తున్నప్పుడు వంటగది, గ్యాస్ స్టవ్ చాలా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి.అంతేకాకుండా సాత్విక ఆహారమే ప్రసాదంగా పెట్టాలి.

దేవుడిని ప్రసాదం నివేదన చేస్తున్నప్పుడు కచ్చితంగా స్నానం చేయాలి.అంతేకాకుండా ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి.ఒక్కసారి విడిచిపెట్టిన దుస్తులను అస్సలు ధరించకూడదు.

అదే విధంగా దేవుడికి ప్రసాదం పెట్టే పాత్ర కూడా చాలా ముఖ్యం.

These Are The Mistakes That Should Not Be Made While Offering Prasad To God, Poo

ఈ ప్రసాదం పెట్టే పాత్ర బంగారం, వెండి, రాగి, ఇత్తడి పాత్ర( Silver vessel )లో మాత్రమే ప్రసాదాన్ని అందించాలి.అలాగే దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడే ఉంచకూడదు.దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

కాబట్టి ప్రసాదం సమర్పించిన కొద్దిసేపటికి ప్రసాదాన్ని తీసి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పంచాలి.దీని వలన ఇంట్లో సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలిసి వస్తాయని వేద పండితులు చెబుతున్నారు.

Advertisement

కాబట్టి పూజ చేసే సమయం లో అలాగే పూజ చేసే ముందు ఈ నియమాలను పాటించడం చాలా ముఖ్యం.

తాజా వార్తలు