ఆదిపురుష్ హైలెట్స్ ఇవే...గూస్ బంప్స్ పక్క...

ప్రస్తుతం ఇండియన్ సినీ అభిమానుల చూపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా( Adipurush movie ) పైనే ఉంది .

మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది .

ఇక ప్ర‌భాస్ సినిమాతో( Prabhas ) బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డేందుకు ఇత‌ర హీరోలు ఎవ‌రూ దైర్యం చేయడం లేదు .అందుకే ఇండియా వైడ్‌గా దాదాపు 4000ల‌కు పైగా స్క్రీన్స్‌లో ఆదిపురుష్ రిలీజ్ కాబోతున్న‌ది.తెలుగు రాష్ట్రాల్లోనే వెయ్యికిపైగా థియేట‌ర్ల‌ను ఆదిపురుష్‌కు కేటాయించినట్టు తెలుస్తుంది .ఏపీ, తెలంగాణ‌లో ఆదిపురుష్ థియేట్రిక‌ల్ బిజినెస్‌ 120 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

మ‌రో వైపు సినిమాకు సంబంధించిన కీలక హైలైట్స్ ఫిల్మ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.ఈ సినిమాలో మొదటగా వాలి సుగ్రీవుల ఎపిసోడ్ ఊహించని విధంగా షాక్ ఇస్తుందట.దుష్టసంహారం కోసం ధర్మాన్ని పక్కన పెట్టడంలో తప్పు లేదనే రీతిలో చెప్పిన డైలాగులు, అక్కడ గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు.

లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసే సన్నివేశం, రాఘవుడు-ఖరుడు మధ్య యుద్ధం, తోకతో హనుమంతుడు లంకా దహనం చేసే సీన్ త్రీడిలో చూస్తేనే ఆ అనుభూతి గొప్పగా ఉంటుందని ఊరిస్తున్నారు.

Advertisement

ఇక క్లైమాక్స్ లో వచ్చే రామ రావణ యుద్ధకాండ( Battle of Rama Ravana ) ఇండియన్ సినిమాలోనే బెస్ట్ క్లైమాక్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.సైఫ్అలీ ఖాన్ మీద ఉన్న నెగటివిటీ సినిమా చూశాక మొత్తం పోతుందట.సెన్సార్ సభ్యులు విభ్రాంతి చెందేలా దర్శకుడు ఓం రౌత్ మాయాజాలం చేశాడని అంటున్నారు.

మొత్తానికి ఇవి వినగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి.రామసేతు బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఓ రేంజ్ లో వచ్చిందని తెలిసింది.

బాక్సాఫీస్ వద్ద సినిమాలు లేక డ్రైగా ఉన్న పరిస్థితుల్లో థియేటర్లను హౌస్ ఫుల్ చేసి జనాలతో కిక్కిరిసిపోయేలా చేసేది ఒక్క ఆదిపురుష్ మాత్రమేనని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు.ఎనభై శాతానికి పైగా త్రీడి ప్రింట్లే ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అలాగే ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి .

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు