మీరు నాన్ వెజ్ తినరా..? అయితే ఈ పండ్లు మీ డైట్‌లో ఉండాల్సిందే!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాన్ వెజ్‌కు దూరంగా ఉండే శాఖాహారాలు కోట్ల సంఖ్య‌లో ఉన్నారు.వీరు క‌నీసం గుడ్డును కూడా ద‌గ్గ‌రికి రానివ్వ‌రు.

ఎప్పుడూ ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు, ప‌ప్పుధాన్యాలే తింటుంటారు.ఇది మంచి ప‌ద్ధ‌తే అయినా.

నాన్ వెజ్‌ను పూర్తిగా ఎవైడ్ చేయ‌డం వ‌ల్ల ప్రోటీన్ కొర‌త ఏర్పడుతుంది.వాస్త‌వానికి ప్రోటీన్ లోపంతో బాధ ప‌డే వారిలో చాలా వ‌ర‌కు శాఖాహారులే ఉంటారు.

అందుకే ప్రోటీన్‌ను భ‌ర్తీ చేసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.అందుకు కొన్ని కొన్ని పండ్లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.అవకాడో.

ప్రోటీన్ పుష్క‌లంగా ఉండే పండ్ల‌లో ఇది ఒక‌టి.చికెన్, మటన్‌, ఫిష్‌ వంటి మాంసాహారాల‌ను తిన‌క‌పోయినా త‌ర‌చూ అవ‌కాడో పండును తీసుకుంటే శ‌రీరంలో ప్రోటీన్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పైగా అవ‌కాడోలో ఉండే పోష‌కాలు సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తాయి.మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను నివారిస్తాయి.

మ‌రియు చ‌ర్మ ఆరోగ్యాన్ని ర‌క్షిస్తాయి.అలాగే చ‌వ‌క ధ‌ర‌కు ల‌భించే నేరేడు పండ్లూ మ‌నకు కావాల్సిన ప్రోటీన్‌ను అందించ‌గ‌ల‌వు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

అందువ‌ల్ల‌, నేరేడు పండ్ల‌ను డైట్‌లో చేర్చుకుంటే ప్రోటీన్ ల‌భిస్తుంది.శరీరంలో అధిక వేడి త‌గ్గుతుంది.కంటి చూపు పెరుగుతుంది.

Advertisement

మూత్ర సంబంధ సమస్యలు సైతం దూరం అవుతాయి.

మ‌ధుర‌మైన రుచిని క‌లిగి ఉండే ప‌న‌స పండులో కూడా ప్రోటీన్ ఉంటుంది.త‌ర‌చూ ప‌న‌స పండును తీసుకుంటే మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్‌తో పాటు మ‌రిన్నో పోష‌కాల‌నూ పొందొచ్చు.ఇక ఇవే కాకుండా జామ పండు, బ్లాక్ బెర్రీ, నారింజ పండు, అంజీర్ వంటి వాటిలోనూ ప్రోటీన్ ఉంటుంది.

కాబ‌ట్టి, నాన్ వెజ్ తిన‌ని శాఖామారులు ఈ పండ్లును డైట్‌లో చేర్చుకుంటే గ‌నుక ప్రోటీన్ లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

తాజా వార్తలు